హిమాచల్ లో అపారమైన సంపద గల కమ్రునాగ్ సరస్సు… మిస్టరీ ఏంటి?

హిమాచల్ ప్రదేశ్ లోని కమ్రునాగ్ సరస్సు అత్యంత సుందర ప్రదేశం. ఇందులో అపారమైన సంపద దాగి ఉన్నట్లు చెబుతారు. ఆధ్యాత్మికత నిండిన వారి మనస్సులకు కమ్రునాగ్ సరస్సు ఒక ఒయాసిస్ లా అనిపిస్తుంది. ఈ సరస్సు చుట్టూ ఉండే అందాలు ప్రకృతి ప్రేమికులకు కనుల విందు చేస్తాయి. అందమైన బాల్హ్ లోయ, దౌలధర్ పర్వతశ్రేణి మధ్య సముద్ర మట్టానికి 3,334 మీటర్ల ఎత్తులో హిమాచల్ ప్రదేశ్ కు చెందిన మండి అనే ప్రాంతంలో ఈ సరస్సు ఉంది. […]

హిమాచల్ లో అపారమైన సంపద గల కమ్రునాగ్ సరస్సు... మిస్టరీ ఏంటి?
Follow us

| Edited By:

Updated on: Jan 28, 2020 | 9:01 PM

హిమాచల్ ప్రదేశ్ లోని కమ్రునాగ్ సరస్సు అత్యంత సుందర ప్రదేశం. ఇందులో అపారమైన సంపద దాగి ఉన్నట్లు చెబుతారు. ఆధ్యాత్మికత నిండిన వారి మనస్సులకు కమ్రునాగ్ సరస్సు ఒక ఒయాసిస్ లా అనిపిస్తుంది. ఈ సరస్సు చుట్టూ ఉండే అందాలు ప్రకృతి ప్రేమికులకు కనుల విందు చేస్తాయి. అందమైన బాల్హ్ లోయ, దౌలధర్ పర్వతశ్రేణి మధ్య సముద్ర మట్టానికి 3,334 మీటర్ల ఎత్తులో హిమాచల్ ప్రదేశ్ కు చెందిన మండి అనే ప్రాంతంలో ఈ సరస్సు ఉంది.

పరాశర మహర్షి ఇక్కడ కొంతకాలం తపస్సుని ఆచరించాడు అని స్థలపురాణం పేర్కొంటోంది. ఆ కారణంగానే ఈ ప్రదేశానికి పరాశర సరస్సు అన్న పేరు వచ్చింది.వాస్తవానికి త్రివేండ్రంలోని పద్మనాభస్వామి ఆలయంలో రహస్యమైన ఖజానా లోపల ఏముందో ఎవరికీ తెలియని విధంగా… ఈ సరస్సు లోపల దాగి ఉన్న సంపద ఎంత ఉందో నిర్ధారించేందుకు ఎవ్వరూ సాహసించరు. చాలా మంది ప్రజలు ఈ ప్రాంతాన్ని సందర్శించి దేవతల అనుగ్రహం పొందేందుకు భక్తితో ధనాన్ని సమర్పిస్తుంటారు.

ఏటా మే- జూన్‌ నెలల మధ్య ఈ ఆలయం దగ్గర ఓ అద్భుతమైన జాతర జరుగుతుంది. ఆ జాతరలో పాల్గొనేందుకు చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలంతా ఇక్కడికి చేరుకుంటారు. ఏదేమైనా కమ్రునాగ్ యొక్క ఈ అపురూపమైన స్వభావం దశాబ్ధాలుగా ఒక రహస్యంగానే మిగిలిపోయింది. ఇందులో దాగి ఉన్న సంపదను దోచుకునేందుకు దొంగలు చాలా సార్లు ప్రయత్నించినా సంరక్షక దేవతల ఆగ్రహం కారణంగా అవి ఫలించలేదని స్థానికులు నమ్ముతారు. ప్రతి ఏటా జూన్ నెలలో భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుని ప్రధాన దేవతకు ప్రార్ధనలు నిర్వహిస్తారు.