52 గంటలకు మించి పనిచేస్తున్నారా..! అయితే మీకు అలోఫేసియా కన్ఫర్మ్..!

| Edited By:

Oct 28, 2019 | 12:25 PM

వారానికి 52 గంటలకు మించి పనిచేస్తున్నారా..! అయితే మీ జుట్టును మీరు కాపాడుకోవడం కష్టమే. మీరు చదివింది నిజమేనండి. 52 గంటల కంటే ఎక్కువ పనిచేస్తే మామూలు కంటే జుట్టు రాలే అవకాశం రెండు రెట్లు అధికంగా ఉంటుందట. సౌత్ కొరియాకు చెందిన శాంగ్విన్‌ఖ్వాన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. మగవాళ్లలో జుట్టు రాలేందుకు గల కారణాలపై వారు పరిశోధనలు చేయగా.. అందులో ఎక్కువ పనిచేయడం కూడా ఒక కారణంగా […]

52 గంటలకు మించి పనిచేస్తున్నారా..! అయితే మీకు అలోఫేసియా కన్ఫర్మ్..!
Follow us on

వారానికి 52 గంటలకు మించి పనిచేస్తున్నారా..! అయితే మీ జుట్టును మీరు కాపాడుకోవడం కష్టమే. మీరు చదివింది నిజమేనండి. 52 గంటల కంటే ఎక్కువ పనిచేస్తే మామూలు కంటే జుట్టు రాలే అవకాశం రెండు రెట్లు అధికంగా ఉంటుందట. సౌత్ కొరియాకు చెందిన శాంగ్విన్‌ఖ్వాన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. మగవాళ్లలో జుట్టు రాలేందుకు గల కారణాలపై వారు పరిశోధనలు చేయగా.. అందులో ఎక్కువ పనిచేయడం కూడా ఒక కారణంగా తేలింది. అంతేకాదు వీరిలో జుట్టు పెరుగుదల కూడా త్వరగా ఆగిపోతుందని.. తద్వారా బట్టతల వస్తుందని వారు పేర్కొన్నారు.

13వేల మందిపై పరిశోధనలు జరిపిన వారు.. ఉద్యోగులను మూడు రకాలుగా విభజించారు. అందులో 40 గంటలకంటే తక్కువ పనిచేసే వారు.. 40 నుంచి 52గంటల మధ్య పనిచేసేవారు.. 52 గంటలకు మించి పనిచేసేవారిపై ఈ పరిశోధనలు జరిపారు. ఇందులో వయస్సు, చదువు, జీతం, ధూమపానం.. వంటి విషయాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ సేపు పనిచేసే వారిలో అలోఫేసియా(ఉన్నట్లుండి జుట్టు రాలడం, బట్టతలగా మారడం) త్వరగా వచ్చే అవకాశాలు ఉన్నాయని తేల్చారు. ఇక పని ఒత్తిడి, వయస్సు కూడా జుట్టు రాలేందుకు ప్రధాన సమస్యలుగా మారుతాయని వారు పేర్కొన్నారు.