వార్నీ దీని వెనక ఇంత కథుందా.. షర్టులకు జేబులు ఎడమ వైపునే ఎందుకు ఉంటాయంటే?

మనం ప్రతిరోజూ తొడుక్కునే షర్టుల గురించి ఎప్పుడైనా గమనించారా? పురుషుల షర్టులకు జేబు ఎప్పుడూ ఎడమ వైపే ఉంటుంది. చాలా అరుదుగా రెండు వైపులా జేబులు ఉంటాయి తప్ప, కేవలం కుడి వైపు మాత్రమే జేబు ఉన్న షర్టును బహుశా మనం చూసి ఉండము. ఇది కేవలం ఒక ఫ్యాషన్ లేదా సాధారణ డిజైన్ మాత్రమే అనుకుంటే పొరపాటే. దీని వెనుక మానవ శరీర తత్త్వశాస్త్రం, ప్రాచీన చరిత్ర, దుస్తుల తయారీ పరిశ్రమల వ్యూహాలు దాగి ఉన్నాయి. ఆ మొత్తం కథ తెలియాలంటే..పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..

వార్నీ దీని వెనక ఇంత కథుందా.. షర్టులకు జేబులు ఎడమ వైపునే ఎందుకు ఉంటాయంటే?
Why Shirt Pocket Is On The Left

Updated on: Jul 31, 2026 | 11:49 AM

మనం రోజూ వేసుకునే చొక్కాల గురించి ఒక విషయాన్ని మనం బహుశా పెద్దగా పట్టించుకోం. పురుషులు వేసుకునే చాలా చొక్కాలలోనూ, మహిళలు వేసుకునే అనేక చొక్కాలలోనూ జేబు సాధారణంగా ఎడమ వైపున ఉంటుంది. కానీ, దానిని కుడి వైపున కాకుండా ఎడమ వైపునే ఎందుకు పెట్టారనేది చాలా మంది ఆశ్చర్యపోవచ్చు. ఆ వివరాల్లేంటో ఇప్పుడు చూద్దాం..

మనం చరిత్రను వెనక్కి చూస్తే, తొలితరం చొక్కాలకు జేబులు ఉండేవి కావు. అవసరమైన వస్తువులను వేరే జేబులలో లేదా నడుముకు పెట్టుకోవడం ఆనవాయితీగా ఉండేది. ఆ తర్వాత, పెన్నులు, చిన్న నోట్‌బుక్‌లు, డబ్బు మొదలైనవాటిని సులభంగా పెట్టుకోవడానికి వీలుగా చొక్కాలలో జేబులను ప్రవేశపెట్టారు.

కుడిచేతి వాటం ప్రధాన కారణం:

ప్రపంచ జనాభాలో దాదాపు 85 నుండి 90 శాతం మంది కుడిచేతి వాటం ఉన్నవారే. ఒక వ్యక్తి తన కుడిచేతితో ఏదైనా పని చేస్తున్నప్పుడు లేదా రాస్తున్నప్పుడు, షర్టు జేబులో ఉన్న పెన్ను, డబ్బులు, ఐడీ కార్డ్ లేదా మొబైల్ ఫోన్ వంటి వస్తువులను ఎడమచేతితో సులభంగా బయటకు తీయవచ్చు. ఒకవేళ జేబు కుడి వైపు ఉంటే, కుడిచేతితోనే జేబులో చేయి పెట్టడం అంత సౌకర్యవంతంగా ఉండదు.

ఇవి కూడా చదవండి

సైనిక చరిత్ర:

షర్టుకు ఎడమ వైపు జేబు ఉండే సాంప్రదాయం యుద్ద రంగం నుండి ప్రారంభమైంది. పూర్వకాలంలో సైనికులు తమ కుడిచేతితో తుపాకీ లేదా ఖడ్గాన్ని పట్టుకునేవారు. యుద్ధ సమయంలో తమ జేబులో ఉండే గుళ్ళు, మ్యాప్‌లు లేదా ముఖ్యమైన పత్రాలను ఎడమచేతితో వేగంగా తీయాల్సి వచ్చేది. అందుకే మిలిటరీ యూనిఫామ్స్‌లో జేబులను ఎడమ వైపు అమర్చడం ప్రారంభించారు. ఆ తర్వాత ఇది సాధారణ పౌర దుస్తులకు కూడా విస్తరించింది.

మాన్యుఫ్యాక్చరింగ్, పారిశ్రామిక విప్లవం:

19వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం వచ్చి, రెడీమేడ్ దుస్తులను భారీ యంత్రాలపై కుట్టడం ప్రారంభమైనప్పుడు దుస్తుల తయారీదారులు ఒక ప్రామాణిక నియమాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. ఎడమ వైపు జేబు వేయడం అందరికీ సౌకర్యంగా ఉంటుందని గుర్తించి, మాస్ ప్రొడక్షన్ కోసం ఈ డిజైన్‌ను ఖరారు చేశారు.

గుండె రక్షణ, నోట్ల పుస్తకాలు:

పూర్వం రోజుల్లో వ్యాపారులు, అధికారులు తమ డైరీలు, చిన్న నోట్‌బుక్స్, ముఖ్యమైన కాగితాలను గుండెకు దగ్గరగా ఉండే ఎడమ జేబులోనే భద్రపరుచుకునేవారు. కాలం మారినా, ఫ్యాషన్ ట్రెండ్స్ ఎన్నో వచ్చినా.. ఉపయోగం, సౌకర్యం ఆధారంగా ఏర్పడిన ఈ ఎడమ వైపు జేబు సాంప్రదాయం ఇప్పటికీ నిలిచి ఉంది. అందుకే నేటికీ ప్రపంచవ్యాప్తంగా తయారయ్యే ఫార్మల్, కాజువల్ షర్టులకు ఎడమ వైపే పాకెట్ కనిపిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us