
మ్యూజిక్ వినడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మనం పాటలు విన్నప్పుడు మెదడు ‘ఆనందాన్నిచ్చే’ హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. సంగీతం మన హార్మోన్లపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. మీరు ఇష్టమైన సంగీతాన్ని విన్నప్పుడు, మీ శరీరంలోని కార్టిసాల్ స్థాయిలు తగ్గుతాయి. దీనివల్ల ప్రశాంతంగా, రిలాక్స్‌గా ఉంటారు.
మీకు రాత్రిపూట నిద్ర పట్టడంలో ఇబ్బంది ఉంటే పడుకునే ముందు మంచి మ్యూజిక్ వినడం ప్రయోజనకరంగా ఉంటుంది. పాటలు మీ మనసును ప్రశాంతపరిచి, శరీరాన్ని రిలాక్స్ చేస్తాయి. దీనివల్ల మీరు బాగా నిద్రపోతారు. ప్రతిరోజూ పాటలు వినడం వల్ల మీ నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది.
పాటలు ఏకాగ్రతను మరియు దృష్టిని పెంచుతాయి. చదువుకునేటప్పుడు లేదా పని చేసేటప్పుడు ప్రశాంతమైన, మృదువైన సంగీతం వినడం వల్ల పరధ్యానాలు తగ్గి, చేస్తున్న పనిపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది. అందుకే చాలా మంది పని చేసేటప్పుడు సంగీతం వింటారు.
మీకు విసుగుగా లేదా అలసటగా అనిపిస్తే మీకు ఇష్టమైన పాటలు వినండి. అది తక్షణమే మీ మానసిక స్థితిని మార్చగలదు. సంగీతం మీ భావోద్వేగాలను వ్యక్తపరచడానికి, సానుకూల ఆలోచనలను పెంపొందించడానికి సహాయపడుతుంది. దీనివల్ల ప్రతికూల ఆలోచనలు మనసులోకి రాకుండా నివారించవచ్చు.
సంగీతం వినడం గుండె ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. కొన్ని పరిశోధనల ప్రకారం ప్రశాంతమైన సంగీతం రక్తపోటును నియంత్రించడంలో, గుండె స్పందన రేటును స్థిరీకరించడంలో సహాయపడుతుంది. దీనివల్ల గుండెపై భారం తగ్గి, మొత్తం గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొన్ని నిమిషాల పాటు సంగీతం వినడం వల్ల మానసిక విశ్రాంతి లభించి, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.