
నదులు, చెరువులలో వేగంగా, సులభంగా చేపలు పట్టడానికి అనుసరించాల్సిన కొన్ని సింపుల్ టిప్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ సింపుల్ ట్రిక్స్ ట్రై చేశారంటే..గంటల కొద్దీ నిరీక్షణ తప్పుతుంది. నిమిషాల్లోనే కుప్పల కొద్దీ చేపలు మీ బుట్టలో వచ్చి పడతాయ్ అదేలాగంటే..
చేపలు త్వరగా పడటానికి మనం వాడే ఫిషింగ్ హుక్ కీలక పాత్ర పోషిస్తుంది. సోషల్ మీడియాలో యాంగ్లర్ మాస్టర్ అందించిన ట్రిక్ ప్రకారం, ఒక చెంచా ముందు భాగంతో ప్రత్యేకమైన హుక్ తయారు చేసి దానికి రంధ్రాలు చేసి ఎరను అమర్చడం వల్ల చేపలు త్వరగా ఆకర్షించబడతాయి. అలాగే, మీ ఫిషింగ్ రాడ్‌కు ఉపయోగించే దారం కనీసం 16 మిమీ మందం ఉండాలి. తేలికపాటి దారం వాడితే పెద్ద చేప చిక్కినప్పుడు అది సులభంగా తెగిపోయే ప్రమాదం ఉంది.
చేపలకు దృష్టి కంటే ఆఘ్రాణ శక్తి చాలా ఎక్కువ. సహజ సిద్ధమైన వాసనలు ఉన్న ఎరలను వాడితే చేపలు వేగంగా గాలానికి చిక్కుతాయి.
వానపాములు, రొయ్యలు: నదులలో ఉండే చేపలకు ఇవి ఇష్టమైన ఆహారం.
చేపల నూనె లేదా ప్రత్యేక నూనెలు: ఎరపై కొద్దిగా చేపల నూనె రాయడం వల్ల ఆ వాసనకు సుదూర ప్రాంతాల నుండి చేపలు ఈదుకుంటూ వస్తాయి.
గోధుమ పిండి ఉండలు: పిండిలో కొద్దిగా మైదా, ఇంగువ లేదా ప్రత్యేక సువాసన ద్రవ్యాలు కలిపి ఉండలుగా చేసి హుక్‌కు తగిలిస్తే చేపలు త్వరగా రంధ్రంలోకి రావడం సులువవుతుంది.
హుక్‌కు ఎరను గట్టిగా అమర్చిన తర్వాత ఫిషింగ్ రాడ్ సహాయంతో నీటిలోకి దూరంగా విసరాలి. నీటిలో గాలం పడిన తర్వాత కొద్దిసేపు నిశ్శబ్దంగా వేచి ఉండాలి. గాలం వద్ద చిన్నపాటి కదలిక లేదా లాగుతున్నట్లు అనిపిస్తే వెంటనే రాడ్‌ను నెమ్మదిగా పైకి లేపి, రిల్ తిప్పుతూ చేపను బయటకు తీయాలి.
ఈ చిన్నపాటి జాగ్రత్తలు, సరైన ఎర, బలమైన సాధనాలు ఉపయోగిస్తే గంటల తరబడి నీటి ఒడ్డున వేచి చూడకుండా అతి తక్కువ సమయంలోనే బుట్టల కొద్దీ చేపలను పట్టుకోవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..