బి విటమిన్‌తో వాయు కాలుష్యం నుంచి రక్షణ!

| Edited By:

Apr 26, 2019 | 7:39 PM

ఆధునిక ప్రపంచంలో వాయు కాలుష్యం వలన జరిగే అనర్థాలు ఇన్నీ అన్నీ కావు. ఈ కాలుష్యం మన శరీరంలోని పలు అవయవాల మీద ప్రభావం చూపుతోందన్న విషయం విదితమే. వాయుకాలుష్యం వలన కలిగే అనర్థాల గురించి తెలిసినా బయట తిరగకుండా ఉండలేని పరిస్థితి. బయటకు వెళ్ళే సమయంలో ఈ కాలుష్యం బారిన పడకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫలితం శూన్యం. ఈ జాగ్రత్తలు తీసుకోకుండానే విటమిన్‌ బితో కాలుష్య ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు అమెరికా పరిశోధకులు. […]

బి విటమిన్‌తో వాయు కాలుష్యం నుంచి రక్షణ!
Follow us on

ఆధునిక ప్రపంచంలో వాయు కాలుష్యం వలన జరిగే అనర్థాలు ఇన్నీ అన్నీ కావు. ఈ కాలుష్యం మన శరీరంలోని పలు అవయవాల మీద ప్రభావం చూపుతోందన్న విషయం విదితమే. వాయుకాలుష్యం వలన కలిగే అనర్థాల గురించి తెలిసినా బయట తిరగకుండా ఉండలేని పరిస్థితి. బయటకు వెళ్ళే సమయంలో ఈ కాలుష్యం బారిన పడకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫలితం శూన్యం. ఈ జాగ్రత్తలు తీసుకోకుండానే విటమిన్‌ బితో కాలుష్య ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు అమెరికా పరిశోధకులు. కొంతమందికి బి 12, బి-జి విటమిన్లు ఇచ్చిన అనంతరం వాయుకాలుష్యం అధికంగా ఉండే ప్రాంతానికి పంపించారు. అనంతరం వీరిని పరిశీలించగా వాయుకాలుష్యం వీరి జన్యువుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదు. అయితే బి విటమిన్‌ వాయుకాలుష్యం నుంచి రక్షణ కలిపిస్తుందన్న విషయం మొదటిసారి రుజువైంది. దీని మీద ఖచ్చితమైన నిర్ధారణకి ఇంకా కొన్ని పరిశోధనలు నిర్వహించాల్సి ఉంటుంది అంటున్నారు పరిశోధకులు.