Uric Acid diet: యూరిక్ యాసిడ్‌తో బాధ పడుతున్నారా? పొరపాటున కూడా వీటిని తినకండి..

|

Jul 27, 2022 | 7:59 PM

షుగర్ వ్యాధి, బీపీ మాదిరిగానే యూరిక్‌ యాసిడ్‌ కూడా తీవ్రంగా పరిగణించవల్సిన అనారోగ్య సమస్య. రోజువారీ జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు, వివిధ శరీర సమస్యల వల్ల యూరిక్ యాసిడ్ సమస్య..

Uric Acid diet: యూరిక్ యాసిడ్‌తో బాధ పడుతున్నారా? పొరపాటున కూడా వీటిని తినకండి..
Uric Acid Diet
Follow us on

Uric acid diet: షుగర్ వ్యాధి, బీపీ మాదిరిగానే యూరిక్‌ యాసిడ్‌ కూడా తీవ్రంగా పరిగణించవల్సిన అనారోగ్య సమస్య. రోజువారీ జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు, వివిధ శరీర సమస్యల వల్ల యూరిక్ యాసిడ్ సమస్య తలెత్తుతుంది. తిన్న ఆహారం జీర్ణమయ్యే సమయంలో శరీరంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. ఇది మూత్రం ద్వారా బయటికి పోతుంది. ఐతే కొన్ని సందర్భాల్లో ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల యూరిక్ యాసిడ్ పరిమాణం పెరిగే కీళ్లలో, మూత్ర నాళాల్లో పేరుకుపోయే ప్రమాదం ఉంది. యూరిక్ యాసిడ్ స్ఫటికాలలా కనిపిస్తుంది. మూత్ర విసర్జనలోనూ సమస్యలను కలిగిస్తుంది. దీని వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం చాలా ఎక్కువ. మీ శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగినట్లు గమనించినట్లైతే ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. ఎందుకంటే యూరిక్ యాసిడ్ సకాలంలో నియంత్రించబడకపోతే.. కాలేయం పనిచేయడం మానేస్తుంది. గుండెపోటు వంటి సమస్యలు రావచ్చు. కొన్ని రకాల కూరగాయలు మన శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటంటే..

యూరిక్ యాసిడ్ ఉంటే పప్పులు, టమోటాలు తినకూడదనే అపోహ ఉంది. కానీ ఇది వాస్తవం కాదు. ఐతే చేపలు లేదా మాంసం మాత్రం అతిగా తినకూడదు. అలాగూ రెడ్ మీట్, ఆల్కహాల్ పూర్తిగా తినడం మానివెయ్యాలి. బీన్స్ యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతాయి. అందుకే బీన్స్ తినడం పూర్తిగా మానివేయాలి. బఠానీ లేదా పప్పులో ప్యూరిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇది మన శరీరంలో యూరిక్ యాసిడ్ మొత్తాన్ని పెంచుతుంది. ఎండిన పప్పుల్లో ప్యూరిన్లు అధికంగా ఉంటాయి. అందువల్ల వీటికి దూరంగా ఉండాలి. వంకాయల్లో కూడా ప్యూరిన్ క్కువగా ఉంటుంది. ఇది యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచే లక్షణం కలిగి ఉంటుంది. వీటన్నింటికీ దూరంగా ఉండటంతో పాటు అధికంగా నీరు తాగితే యూరిక్‌ యాసిడ్‌ సమస్యను సులభంగా అధిగమించవచ్చు.