భార్యాభర్తల మధ్య బాండింగ్ పెరగడానికి శృంగారం గొప్ప సాధనం. కలయిక తర్వాత ఇద్దరూ ఏకమైన భావన కలగడంతో పాటు, మానసిక ప్రశాంతత లభిస్తుంది. కానీ కొంతమంది శృంగారం తర్వాత సంతోషానికి బదులు… చిరాకు, యాంగ్జైటీ, ఒత్తిడి, అపరాధ భావంతో కుంగిపోవడం.. వంటి పలు మెంటల్ ఇష్యూస్‌తో ఇబ్బంది పడుతున్నట్లు నిపుణులు పరిశోధనల్లో తేలింది. ఇందుకు కారణాలు ఇవి అనే చెప్పలేం కానీ.. ఇలాంటి పరిస్థితి ఉంటే.. మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది. భార్యాభర్తల మధ్య బాండింగ్ కూడా డ్యామేజ్ అవుతుంది. అలా జరగకుండా ఉండాలంటే.. కపుల్స్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కలయిక తర్వాత భార్యాభర్తల మధ్య అనుబంధం మరింత పెరుగుతుంది. ఒకరితో ఒకరు ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకుంటారు. కానీ కలయిక తర్వాత ముభావంగా మారిపోవడం, ఒత్తిడి ఉంటే.. ఆ పరిస్థితిని ‘Postcoital Dysphoria (PCD)’గా చెబుతున్నారు నిపుణులు. ఈ ప్రాబ్లం ఉన్న అందరిలో ఒకే రకమైన లక్షణాలు ఉండకపోవచ్చు.
మానసిక వేదనను అనుభవించడం, ఏదో తెలియని బాధ, నిత్యం ముభావంగా ఉండటం, కోపం కట్టలు తెంచుకోవడం, అకారణంగా పార్టనర్‌పై అరవడం, చిన్న విషయాలకే చిరాకు పడటం, ఉన్నట్లుండి బిగ్గరగా ఏడ్చేయడం, తెలియని బాధ, భయం వెంటాడడం, కలయిక తర్వాత అపరాధ భావంతో, సిగ్గుతో కుంగిపోవడం.. వంటి PCD లక్షణాలుగా నిపుణులు చెబుతున్నారు.
ఈ లక్షణాలు ముదిరితే పలు ఆరోగ్య సమస్యలతో పాటు.. దాంపత్య బంధానికి కూడా బీటలు వారే అవకాశం ఉంది.
క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం, ధ్యానం, యోగా, ప్రాణాయామం వంటివి చేయడం వల్ల ఈ లక్షణాల నుంచి స్వాంతన లభిస్తుంది. అలానే మంచి నిద్ర ఉండేలా జాగ్రత్తపడాలి. మనసులో ఏ ఫీలింగ్ ఉన్నా పార్టనర్‌తో పంచుకోవాలి. అన్ని విషయాల్లోనూ నిజాయితీగా వ్వవహరిస్తూ.. ఇద్దరూ కూర్చుని మాట్లాడుకోవాలి. మీకంటూ ఒకరున్నారన్న భరోసా ఇస్తే.. ఇద్దరి మధ్య గ్యాప్ అనేదే రాదు. లైంగిక కోరికలు, ఫ్యాంటసీలను కూడా ఒకరికొకరు చెప్పుకోవాలి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేకపోతే మాత్రం.. మానసిక నిపుణుల్ని సంప్రదించండి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..