
ఆయుష్ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వ జాతీయ ఆయుర్వేద సంస్థ ప్రకారం తులసి అనేది చర్మ సౌందర్యాన్ని పెంచడంతో ఎంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ముఖంపై మొటిమలు, మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది. తులసిలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు చర్మాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా , ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడతాయి.
తులసి నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు !
నిపుణుల ప్రకారం: తులసి నీరు మన శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేసి చర్మంపై మొటిమలు రాకుండా అడ్డుకుంటుంది. అలాగే కొత్త మచ్చలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. తులసి ఆకులను రోజూ తినడం వల్ల అంతర్గత చర్మ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. తులసిని పలు విధాలుగా చర్మ ఆరోగ్యానికి ఉపయోగింవచ్చు. తులసి ఫేస్ ప్యాక్ ద్వారా ముఖాన్ని మెరిసేలా చేయవచ్చు. ఇందుకోసం ఎనిమిది నుండి పది తాజా తులసి ఆకులను మెత్తగా పేస్ట్ లా చేసి.. దానిలో ముల్తానీ మిట్టి లేదా తేనెతో కలపండి. ఈ పేస్ట్‌ను మీ ముఖంపై పదిహేను నుండి ఇరవై నిమిషాలు అప్లై చేసి, తర్వాత కడిగేయండి. ఇది మొటిమలను తొలగించడంలో, మచ్చలను తగ్గించడంలో, జిడ్డుగల చర్మాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. వారానికి రెండు నుండి మూడు సార్లు దీన్ని ఉపయోగిస్తే.. మీ చర్మం మిళమిళా మెరిసిపోవాల్సిందే
తులసి నీరు : తులసి నీరు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. దీని కోసం, ఐదు నుండి ఏడు తులసి ఆకులను రాత్రిపూట శుభ్రమైన నీటిలో నానబెట్టండి. ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగడం వల్ల విష పదార్థాలు బయటకు వెళ్లి, రక్తాన్ని శుద్ధి చేసి, చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. ఇది మొటిమలకు సులభమైన, ప్రభావవంతమైన నివారణ.
తులసి టీ : తులసి టీ రుచికరమైనది మాత్రమే కాదు, దీనికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ టీ తయారు చేయడానికి, నాలుగు నుండి ఐదు తులసి ఆకులను నీటిలో మరిగించండి. నిమ్మకాయ లేదా తేనెతో కలిపి తాగడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది, చర్మ కాంతి మెరుగుపడుతుంది.
పచ్చి తులసి ఆకులు: ఒత్తిడి వల్ల కలిగే మొటిమలపై ఇది ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది. పచ్చి తులసి ఆకులను నమలడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదయం రెండు నుండి మూడు తాజా తులసి ఆకులను నమలడం వల్ల మీకు తాజాదనం లభిస్తుంది. అలాగే చర్మాన్ని ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది.
రోగనిరోధక శక్తి: తులసిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇది చౌకైన, సహజమైన, సులభంగా లభించే నివారణ. మీకు మొటిమలు లేదా మచ్చలు తీవ్రంగా ఉంటే ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించి తులసిని తీసుకోండి. దీనితో పాటు, మంచి పరిశుభ్రత పాటించడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, పుష్కలంగా నీరు త్రాగడం వల్ల చర్మ కాంతి చాలా రెట్లు పెరుగుతుంది
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.