Summer Tips: మండే ఎండల్లోనూ బాడీని కూల్‌గా ఉంచుకోవాలా?.. జస్ట్‌ ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు

పెరుగుతున్న ఎండల తీవ్రత నుండి శరీరాన్ని కాపాడుకోవడం సమ్మర్‌లో చాలా ముఖ్యం. ఈ సమ్మర్‌లో శరీరాన్ని చల్లగా ఉంచుకునేందుకు సులభంగా జీర్ణమయ్యే, నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మండే ఎండల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ, బాడీని కూల్‌గా ఉంచుకునేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Summer Tips: మండే ఎండల్లోనూ బాడీని కూల్‌గా ఉంచుకోవాలా?.. జస్ట్‌ ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు
Summer Hydration Guide

Updated on: Apr 23, 2026 | 9:55 AM

వేసవిలో మన శరీరానికి అధికంగా చెమట పడుతుంది, దీనివల్ల శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. దీని వల్ల మనం త్వరగా అలసిపోవడం, నీరసించిపోవడం జరుగుతుంది.ఈ సమస్యను అదిగమించేందుకు దాహం వేసే వరకు వేచి ఉండకుండా క్రమం తప్పకుండా నీరు త్రాగడాన్ని అలవాటు చేసుకోవాలి. కేవలం నీరు మాత్రమే కాదు కొన్ని సార్లు నిమ్మరసం లేదా చెరుకు రసం, ప్రూట్‌ జ్యూస్‌లు వంటివి చేర్చుకోవడం ఉత్తమం. ముఖ్యంగా, స్వచ్ఛమైన నీరు, మజ్జిగ శరీరాన్ని కూల్‌గా ఉంచడంలో చాలా బాగా పనిచేస్తాయి. అవి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించి, జీర్ణవ్యవస్థను చల్లగా ఉంచుతాయి. అప్పుడప్పుడు చల్లటి నీటితో స్నానం చేయడం, సహజ పానీయాలను సేవించడం వేసవి వ్యాధుల నుండి మనల్ని రక్షించి, తాజాగా ఉంచడంలో సహాయపడతాయి.

సమ్మర్‌ శరీరాన్ని చల్లగా ఉంచుకునే టిప్స్

ఆహారపు అలవాట్లు: వేసవిలో జీర్ణశక్తి మందగించే అవకాశం ఉన్నందున, తేలికపాటి ఆహారాలు తీసుకోవడం చాలా ముఖ్యం. నూనెలో వేయించిన పదార్థాలు, అతిగా కారం ఉన్న ఆహారాలు, జంక్ ఫుడ్స్‌ అస్సలు తినకండి. ఎందుకంటే ఇవి కడుపులో ఉబ్బరాన్ని పెంచి ఇబ్బంది కలిగిస్తాయి. అలాగే పుచ్చకాయ, దోసకాయ, కర్బూజ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను ఆహారంలో చేర్చుకోండి. ఇవి శరీరంలో చల్లదనాన్ని పెంచుతాయి.వాటితో మధ్యాహ్న భోజనంలో పెరుగు అన్నం లేదా కూరగాయలతో కూడిన సలాడ్లు తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది.అలాగే కడుపు సంబంధిత సమస్యలు రావు.

రోజువారీ జాగ్రత్తలు

సమ్మర్‌లో ఎండ ప్రభావం చర్మంపై పడకుండా ఉండటానికి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. బయటకు వెళ్లేటప్పుడు వదులుగా ఉండే, లేత రంగు కాటన్ దుస్తులను ధరించాలి. ఇలా చేయడం వల్ల గాలి మంచిగా వీసి శరీరాన్ని చల్లబరుస్తుంది. అలాగే సన్‌స్క్రీన్ ఉపయోగించడంతో పాటు, గొడుగు లేదా టోపీని తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. రోజుకు రెండుసార్లు చల్లని నీటితో స్నానం చేయడం వల్ల శరీర వేడి తగ్గి, మనసుకి హాయిగా ఉంటుంది.

సహజ సిద్ధమైన ఉపశమనం

చాలా మంది సమ్మర్ హీట్‌ నుంచి ఉపశమనం పొందేందుకు ఐస్‌క్రీమ్‌లు, కూల్‌డ్రింక్స్ వంటి కృతిమ పానియాలను తాగుతూ ఉంటారు. ఇవి తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చినా, ఆరోగ్యానికి మేలు చేయవు. కాబట్టి మెంతులు లేదా జీలకర్ర కలిపిన నీటిని తాగడం వల్ల శరీరాన్ని అంతర్గతంగా చల్లబరచవచ్చు. ఇంట్లో గాలి వెలుతురు వచ్చేలా కిటికీలను తెరిచి ఉంచాలి. అలాగే రాత్రి వేళల్లో తగినంత నిద్ర, ఒత్తిడి లేని జీవనశైలి వేసవి అనారోగ్యాల నుండి మనల్ని కాపాడతాయి. కాబట్టి వీటిని పాటించడం ద్వారా వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us