మెదడు చురుగ్గా ఉండాలంటే…

| Edited By:

Jun 19, 2019 | 3:48 PM

శారీరక ఆరోగ్యమే మానసికంగా దృఢంగా ఉండేలా చేస్తుంది. మెదడు చురుగ్గా ఉండాలంటే… సరైన నిద్ర అవసరం.. 24 గంటలు పనిచేస్తుంటే ఎలా ఉంటుంది అలసిపోతాం.. విశ్రాంతి కోరుకుంటాం.. అలానే మెదడు 24 గంటలు ఆలోచించలేదు.. రోజులో దానికి కూడా తగినంత విశ్రాంతి అవసరం. అవును… కొన్ని సార్లు మన మెదడు నిద్రలోనూ ఆలోచిస్తుంది. కాబట్టి మెదడుకి తగినంత విశ్రాంతినివ్వండి… హాయిగా గాఢనిద్రలోకి పోయి మెదడు ఆరోగ్యాన్ని కాపాడండి. సమతుల్య ఆహారం, పోషకాహారం మన మెదడు పనితీరుపై ప్రభావాన్ని […]

మెదడు చురుగ్గా ఉండాలంటే...
Follow us on

శారీరక ఆరోగ్యమే మానసికంగా దృఢంగా ఉండేలా చేస్తుంది. మెదడు చురుగ్గా ఉండాలంటే…

  • సరైన నిద్ర అవసరం.. 24 గంటలు పనిచేస్తుంటే ఎలా ఉంటుంది అలసిపోతాం.. విశ్రాంతి కోరుకుంటాం.. అలానే మెదడు 24 గంటలు ఆలోచించలేదు.. రోజులో దానికి కూడా తగినంత విశ్రాంతి అవసరం. అవును… కొన్ని సార్లు మన మెదడు నిద్రలోనూ ఆలోచిస్తుంది. కాబట్టి మెదడుకి తగినంత విశ్రాంతినివ్వండి… హాయిగా గాఢనిద్రలోకి పోయి మెదడు ఆరోగ్యాన్ని కాపాడండి.
  • సమతుల్య ఆహారం, పోషకాహారం మన మెదడు పనితీరుపై ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో అన్నీ పోషకాలు ఉన్నాయో లేదో చూసుకోండి. కార్బొహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లు సరిగ్గా ఉండాలి. అది ఎలా ఉంటే కార్బొహైడ్రేట్లు ఎక్కువగా, కొవ్వులు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ప్రోటీన్లు మాత్రం తప్పనిసరి.
  • వ్యాయామం: శారీరాక వ్యాయామం, యోగాసనాల వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది కాబట్టి.. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. యోగాసానాలు చేయండి. దీనివల్ల మనం మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుందని పరిశోధనల్లో తేలింది.
  • మెదడుకి పనిచెప్పండి.. మెదడులో చాలా తక్కువ శాతాన్నే మనం వాడుతున్నాం. కాబట్టి, కొత్త పనులు చెప్పండి.. ప‌జిల్స్ ఫిల్ చేయడం.. విద్యను అభ్యసించడం.. కొత్త విషయాలను నేర్చుకోవడం వంటివి చేయండి.
  • సాధారణంగా మనం రోజూ కాఫీ, టీలను తాగుతూనే ఉంటాం. వీటివల్ల కొన్ని రకాల ప్రతికూల ప్రభావాలు ఉన్నా.. మెదడు విషయానికి వస్తే మాత్రం ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ మితంగా కాఫీని తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ముఖ్యంగా ఏదైనా ఆలోచించాల్సి వచ్చినప్పుడుగానీ, దేనిగురించైనా విశ్లేషించాల్సి వచ్చినప్పుడుగానీ కాఫీ అద్భుతంగా పనిచేస్తుంది. కాఫీ, టీలలో కెఫీన్ అనే రసాయన పదార్థం ఉంటుంది. ఇది శరీరంలో ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది.