Lifestyle: ఎన్ని ప్రయత్నాలు చేసినా మలబద్ధకం తగ్గడం లేదా.? ఈ పండ్లు తింటే చాలు..

|

Jul 21, 2024 | 4:50 PM

ఈ సమస్య నుంచి బయటపడడానికి రకరకాల మందులను వాడుతుంటారు. అయితే తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా మల బద్ధకం సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉండే ఫుడ్‌ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. ఇంతకీ ఆ పండ్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Lifestyle: ఎన్ని ప్రయత్నాలు చేసినా మలబద్ధకం తగ్గడం లేదా.? ఈ పండ్లు తింటే చాలు..
Constipation
Follow us on

మలబద్ధకం సర్వసాధారణమైన సమయం. మనలో చాలా మంది ఏదో ఒక సమయంలో ఈ సమస్య బారిన పడే ఉంటారు. తీసుకునే ఆహారంలో మార్పుల కారణంగా, జీవనశైలిలో మార్పుల కారణంగా మలబద్ధకంతో ఇబ్బందిపడుతున్నారు. ఈ సమస్య బారిన పడగానే చాలా మంది వైద్యులను సంప్రదిస్తుంటారు.

ఈ సమస్య నుంచి బయటపడడానికి రకరకాల మందులను వాడుతుంటారు. అయితే తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా మల బద్ధకం సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉండే ఫుడ్‌ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. ఇంతకీ ఆ పండ్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* మలబద్ధకం సమస్య నుంచి బయటపడాలంటే బొప్పాయిని ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఫైబర్‌ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఖాళీ కడుపుతో బొప్పాయిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగువుతుంది. దీంతో మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు.

* రోజుకో యాపిల్‌ తీసుకుంటే ఆహారానికి మేలు జరుగుతుందని తెలిసిందే. జీర్ణ సంబంధిత సమస్యలకు కూడా యాపిల్స్‌ బాగా ఉపయోగపడుతాయి. వీటిలో ఉండే పెక్టిన్ అనే కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది మలాన్ని మృదువుగా మార్చడంలో ఉపయోగపడుతుంది. పేగులో చలనశీలతను పెంచుతుంది. దీంతో సుఖ విరేచనం అవుతుంది.

* ద్రాక్ష కూడా మలబద్ధకాన్ని బలదూర్‌ చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ద్రాక్షలో ఉండే నీరు, ఫైబర్‌ కంటెంట్‌ జీర్ణ సంబంధిత సమస్యను దూరం చేస్తుంది. మలబద్ధకాన్ని పరార్‌ చేయడంలో ఇది ఉపయోగపడుతుంది.

* అరటి పండ్లు కూడా మలబద్ధక సమస్యను దూరం చేయడంలో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పొటాషియం కండరాల నొప్పులను తగ్గిస్తుంది. పేగు చలనశీలతను పెంచుతుంది. దీంతో సుఖ విరోచనం అవుతుంది.

* మలబద్ధకాన్ని దూరం చేయడంలో ఆరంజ్‌ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని విటమిన్‌ సి, ఫైబర్‌ కంటెంట్‌ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఆరెంజ్‌ కీలక పాత్ర పోషిస్తుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..