Heart Attack: ముఖంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? హార్ట్ ఎటాక్‌ లక్షణాలు కావొచ్చు..

|

Aug 06, 2024 | 4:32 PM

అయితే గుండెపోటు సమస్యను వీలైనంత త్వరగా గుర్తించడం వల్ల చికిత్స కూడా సులభతరమవుతుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని ముందస్తు లక్షణాల ద్వారా గుండెపోటును ముందుగానే గుర్తించవచ్చు. ఇలాంటి ఎన్నో లక్షణాలు గుండెపోటును ముందుగానే చెప్పేస్తాయి. అలాంటి వాటిలో ముఖంలో కనిపించే లక్షణాలు కూడా ఉన్నాయి. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Heart Attack: ముఖంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? హార్ట్ ఎటాక్‌ లక్షణాలు కావొచ్చు..
Heart Attack
Follow us on

మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా గుండెపోటు బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. ఒకప్పుడు వయసు మళ్లిన వారిలో మాత్రమే గుండెపోటు సంబంధిత సమస్యలు కనిపించేవి కానీ, ప్రస్తుతం పట్టుమని పాతికేళ్లు కూడా నిండని వారిలో గుండె పోటు సంబంధిత సమస్యలు కనిపించడం.. గుండెపోటుతో మరణించిన సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.

అయితే గుండెపోటు సమస్యను వీలైనంత త్వరగా గుర్తించడం వల్ల చికిత్స కూడా సులభతరమవుతుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని ముందస్తు లక్షణాల ద్వారా గుండెపోటును ముందుగానే గుర్తించవచ్చు. ఇలాంటి ఎన్నో లక్షణాలు గుండెపోటును ముందుగానే చెప్పేస్తాయి. అలాంటి వాటిలో ముఖంలో కనిపించే లక్షణాలు కూడా ఉన్నాయి. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఎలాంటి కారణం లేకుండా ముఖం ఉబ్బినట్లు కనిపిస్తే వెంటనే అలర్ట్‌ కావాలని నిపుణులు చెబుతున్నారు. ఇది గుండెపోటుకు ప్రాథమిక లక్షణం అయ్యుండొచ్చని నిపుణులు అంటున్నారు. గుండె రక్తాన్ని సరిగ్గా పంప్‌ చేయలేని సమయంలో శరీరంలో ద్రవం పేరుకుపోతుంది. ఇది ముఖం ఉబ్బడానికి కారణమవుతుంది.

* కళ్ల కింద అలాగే, కనురెప్పల దగ్గర కాలెస్ట్రాల్ పేరుకుపోతున్నట్లు కనిపిస్తే కూడా అది గుండెపోటుకు ప్రాథమిక సంకేతంగా భావించాలని నిపునులు చెబుతున్నారు. కళ్ల చుట్టూ లేత పసుపు రంగు పదార్థం చేరుతుంది. ఇది గుండె, మెదడుతో పాటు ఇతర అవయవాలకు రక్తం చేరకుండా నిరోధించవచ్చు. ఇది స్ట్రోక్‌కు దారి తీయడానికి అవకాశాలు ఉంటాయి.

* గుండెపోటు వచ్చే ముందు ముఖంలో కనిపించే మరో లక్షణం.. ముఖం ఎడమ వైపు నొప్పి లేదా తిమ్మిరి వంటి సంకేతాలు కనిపిస్తాయి. ముఖంపై తిమ్మిరి ఉన్న భావన అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

* ముఖం ఉన్నపలంగా నీలం లేదా పసుపు రంగులోకి మారితే. అది గుండెపోటు లక్షణంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. గుండె పనితీరు దెబ్బతింటే శరీరానికి ఆక్సిజన్‌ సరిగ్గా అందదు. దీంతో ముఖం నీలం రంగులోకి మారుతుంది.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..