Garlic: వెల్లుల్లి మంచిదే కానీ.. ఈ సమయాల్లో తీసుకుంటే మాత్రం చాలా డేంజర్‌

|

Sep 13, 2024 | 7:56 PM

వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుండె ఆరోగ్యంతో పాటు, బరువు తగ్గాలనుకునే వారి వరకు ప్రతీ ఒక్కరికీ వెల్లుల్లి...

Garlic: వెల్లుల్లి మంచిదే కానీ.. ఈ సమయాల్లో తీసుకుంటే మాత్రం చాలా డేంజర్‌
Garlic
Follow us on

వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుండె ఆరోగ్యంతో పాటు, బరువు తగ్గాలనుకునే వారి వరకు ప్రతీ ఒక్కరికీ వెల్లుల్లి ఎంతో మేలు చేస్తుంది. అయితే వెల్లుల్లి వల్ల ఆరోగ్యానికి లాభాలు ఉన్నాయనడంలో ఎంత నిజం ఉందో. సరైన సమయంలో తీసుకోకపోతే మాత్రం ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఏయే సమయాల్లో వెల్లుల్లి తీసుకోకకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

ఒకవేళ మీరు ఏదైనా ఆపరేషన్‌ చేయించుకోవడానికి సిద్ధమవుతుంటే వెల్లుల్లి తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఆపరేష్‌కు ముందు, తర్వాత వారం నుంచి పదిరోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో వెల్లుల్లిని తీసుకోకూడదని సూచిస్తున్నారు. దీనికి కారణంగా వెల్లుల్లిలో రక్తస్రావాన్ని పెంచే గుణాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా రక్తం పలుచగా మారే ట్యాబ్లెట్స్‌ వడే వారు వెల్లుల్లికి దూరంగా ఉండాలి. వెల్లుల్లి రక్తస్రావాన్ని పెంచుతుంది, రక్తం గడ్డకట్టే సంభావ్యతను తగ్గిస్తుంది.

దీంతో ఆపరేషన్‌ సమయంలో లేదా తర్వాత రక్తస్రావం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. షుగర్‌ కంట్రోల్‌ ట్యాబ్లెట్స్‌, రక్తాన్ని పలుచన చేసే ట్యాబ్లెట్స్‌ ఉపయోగిస్తున్న సమయంలో వెల్లుల్లిని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. ఇర కొందరికి వెల్లుల్లి వల్ల అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చర్మ సంబంధిత సమస్యలతో బాధపడేవారు వెల్లుల్లిని తీసుకోకపోవడమే మంచిది. రక్తపోటుతో బాధపడేవారు కూడా వెల్లుల్లిని మితంగా తీసుకోవడమే మంచిది. వెల్లుల్లి ఎక్కువగా తీసుకోడం వల్ల రక్త సరఫరా పెరుగుతుంది. ఇక వెల్లుల్లి కారణంగా రక్తంలో షుగర్ లెవల్స్‌ పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వెల్లుల్లిని మితంగా తీసుకోవడమే మంచిదని సూచిస్తున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..