Lifestyle: ఫ్రిజ్‌ వాటర్‌ తాగితే లావుగా అవుతారా.? నిపుణులు ఏమంటున్నారంటే..

|

Apr 04, 2024 | 9:03 PM

ఎండలు దంచికొడుతున్నాయి. ఏప్రిల్‌ నెల మొదటి వారంలోనే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం పదింటికే అడుగు బయటపెట్టలేని పరిస్థితి ఉంది. మండుటెండల కారణంగా విపరీతమైన దాహం వేస్తుంది. దీంతో చాలా మంది చల్లటి నీరును ఆశ్రయిస్తుంటారు. ఫ్రిజ్‌లో పెట్టిన చల్లటి నీరును తాగుతుంటారు. అయితే ఫ్రిజ్‌ వాటర్‌ వల్ల ఎన్నో రకాల సమస్యలు...

Lifestyle: ఫ్రిజ్‌ వాటర్‌ తాగితే లావుగా అవుతారా.? నిపుణులు ఏమంటున్నారంటే..
Cool Water
Follow us on

ఎండలు దంచికొడుతున్నాయి. ఏప్రిల్‌ నెల మొదటి వారంలోనే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం పదింటికే అడుగు బయటపెట్టలేని పరిస్థితి ఉంది. మండుటెండల కారణంగా విపరీతమైన దాహం వేస్తుంది. దీంతో చాలా మంది చల్లటి నీరును ఆశ్రయిస్తుంటారు. ఫ్రిజ్‌లో పెట్టిన చల్లటి నీరును తాగుతుంటారు. అయితే ఫ్రిజ్‌ వాటర్‌ వల్ల ఎన్నో రకాల సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. ఫ్రిజ్‌ వాటర్‌ కారణంగా ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఫ్రిజ్‌ వాటర్‌ వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఫ్రిజ్‌లో పెట్టిన వాటర్‌ కారణంగా గుండెపై దుష్ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చల్లటి నీరు తాగితే రక్త నాళాలు కుంచించుకుపోతాయి ఇది రక్త ప్రసరణను అడ్డుకునే అవకాశం ఉంటుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. చల్లటి నీరు తాగడం వల్ల రక్తనాళాలు గట్టిపడతాయి, దాని వల్ల సమస్యలు మొదలవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

* చల్లటి నీరు తాగడం వల్ల శరీరంలోని కొవ్వు నెమ్మదిగా కరుగుతుంది. స్థూలకాయాన్ని తగ్గించుకోవడంలోనూ, కొవ్వును కరిగించుకోవడంలోనూ ఇది చాలా కష్టంగా మారుతుంది. మీరు ఒకవేళ బరువు తగ్గాలనుకుంటే మాత్రం కచ్చితంగా చల్లటి నీటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

* ఇక ఫ్రిజ్‌లో వాటర్‌ తాగడం వల్ల జీర్ణశక్తిపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీంతో జీర్ణ సమస్యలతో పాటు బరువు కూడా పెరుగుతారు. అలాగే మలబద్ధకం సమస్య సైతం వేధిస్తుంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఫ్రిజ్‌ వాటర్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..