Lifestyle: వ‌ర్షాకాలం క‌డుపులో ఇన్ఫెక్ష‌న్‌కు కార‌ణం ఏంటి.? ఎలాంటి జాగ్ర‌త్త‌లు పాటించాలి..

|

Aug 03, 2024 | 10:25 AM

వ‌ర్ష‌కాలం వ‌చ్చిందంటే చాలు ఎన్నో ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు వెంటాడుతుంటాయి. ఎప్పుడూ లేని విధంగా అనే ర‌కాల వ్యాధులు వ‌స్తుంటాయి. వీటిలో ఒక‌టి క‌డుపులో ఇన్ఫెక్ష‌న్స్ ఒక‌టి. ముఖ్యంగా చిన్నారుల్లో ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా క‌నిపిస్తుంటుంది. అప‌రిశ‌భ్ర‌మైన ఆహారం, క‌లుషిత‌మైన నీటిని తీసుకోవ‌డం...

Lifestyle: వ‌ర్షాకాలం క‌డుపులో ఇన్ఫెక్ష‌న్‌కు కార‌ణం ఏంటి.? ఎలాంటి జాగ్ర‌త్త‌లు పాటించాలి..
Stomach Pain
Follow us on

వ‌ర్ష‌కాలం వ‌చ్చిందంటే చాలు ఎన్నో ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు వెంటాడుతుంటాయి. ఎప్పుడూ లేని విధంగా అనే ర‌కాల వ్యాధులు వ‌స్తుంటాయి. వీటిలో ఒక‌టి క‌డుపులో ఇన్ఫెక్ష‌న్స్ ఒక‌టి. ముఖ్యంగా చిన్నారుల్లో ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా క‌నిపిస్తుంటుంది. అప‌రిశ‌భ్ర‌మైన ఆహారం, క‌లుషిత‌మైన నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ఇలలాంటి ఇన్ఫెక్ష‌న్ స‌మ‌స్యలు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని ల‌క్ష‌ణాల ద్వారా ఈ స‌మ‌స్య‌ను త్వ‌ర‌గా గుర్తించి, చికిత్స తీసుకుంటే స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చు. ఇంత‌కీ ఆ ల‌క్ష‌ణాలు ఏంటి.? ఇన్ఫెక్ష‌న్ వ‌స్తే ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

క‌డుపులో ఇన్ఫెక్ష‌న్ వ‌చ్చిన వెంట‌నే క‌నిపించే ప్ర‌ధాన ల‌క్ష‌ణాల్లో వాంతులు, జ్వ‌రం, అతిసారం, క‌డుపు నొన‌ప్పి వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. సాధార‌ణంగా రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారిలో కడుపు ఇన్ఫెక్షన్ తరచుగా సంభవిస్తుంది. చాలా మంది దీనిని ఇన్ఫ్లుఎంజాను కార‌ణంగా చెబుతుంటారు. ఈ స‌మ‌స్య తాలుకూ ల‌క్ష‌ణాలు క‌నిపించిన వెంట‌నే ఇంట్లోనే కొన్ని నేచుర‌ల్ టిప్స్ పాటించ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చు.

వ‌ర్షాకాలంలో చిన్నారుల‌కు కాచి, చ‌ల్లార్చిన నీటిని అందించాలి. దీనివ‌ల్ల నీటిలో ఇన్ఫెక్ష‌న్ల‌కు కార‌ణ‌మ‌య్యే బ్యాక్టీరియాలు అంత‌మ‌వుతాయి. మ‌రీ ముఖ్యంగా ట్యాప్ వాట‌ర్ ఉప‌యోగించే వారు ఈ జాగ్ర‌త్త‌లు ఎక్కువ‌గా తీసుకోవాలి. క‌డుపులో ఇన్ఫెక్ష‌న్ ఉంటే తీసుకునే ఆహారంలో కూడా జాగ్ర‌త్త‌లు పాటించాలి. లైట్ ఫుడ్‌ను ఇవ్వాలి. సాధార‌ణంగా క‌డుపులో ఇన్ఫెక్ష‌న్ అయితే అతిసారం, వాంతులు వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి కాబ‌ట్టి. శ‌రీరంలో డీహైడ్రేష‌న్ స‌మ‌స్య త‌లెత్తే అవ‌కాశం ఉంటుంది. కాబ‌ట్టి శ‌రీరంలో నీటి శాతం త‌గ్గ‌కుండా చూసుకోవాలి. కాబ‌ట్టి చిన్నారుల్లో డీహైడ్రేష‌న్ స‌మ‌స్య రాకుండా కొబ్బ‌రి నీళ్లు లేదా ఎల‌క్ట్రోలైట్స్ ఎక్కువ‌గా ఉండే డ్రింక్స్‌ను అందించాలి.

నోట్‌: పైన తెలిపిన విష‌యాలు కేవ‌లం ప్రాథ‌మిక స‌మాచారం మేర‌కు మాత్ర‌మే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచ‌న‌లు పాటించ‌డ‌మే ఉత్త‌మం.

మ‌రిన్ని లైఫ్ స్టైల్ వార్త‌ల కోసం క్లిక్ చేయండి..