Lifestyle: పాలకు సంబంధించి మీకూ ఈ అపోహలు ఉన్నాయా.?

|

Apr 16, 2024 | 2:57 PM

సంపూర్ణ ఆహౄరంగా భావించే పాలను కచ్చితంగా ప్రతీ ఒక్కరూ తీసుకోవాలని నిపుణులు సైతం సూచిస్తంటారు. కాల్షియం మొదలు ఎన్నో మంచి గుణాలకు పాలు పెట్టింది పేరు. అయితే మనలో చాలా మందికి పాలకు సంబంధించిన కొన్ని అపోహలు ఉంటాయి. ఇంతకీ పాలకు సంబంధించి ఉండే అపోహలు ఏంటి.? వాటిలో నిజం ఎంత ఉంటుంది.?

Lifestyle: పాలకు సంబంధించి మీకూ ఈ అపోహలు ఉన్నాయా.?
Milk
Follow us on

పాలు మనందరి జీవితంలో ఒక భాగం. ఉదయం లేవగానే ఒక కప్పు కాఫీ లేదా టీతో రోజులు మొదలు పెట్టే వారు చాలా మంది ఉంటారు. పాలలోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే చిన్నారుల నుంచి మొదలు వృద్ధుల వరకు కచ్చితంగా ప్రతీ రోజూ పాలను తీసుకుంటుంటారు. వైద్యులు కూడా పాలను కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలని చెప్తారు.

సంపూర్ణ ఆహౄరంగా భావించే పాలను కచ్చితంగా ప్రతీ ఒక్కరూ తీసుకోవాలని నిపుణులు సైతం సూచిస్తంటారు. కాల్షియం మొదలు ఎన్నో మంచి గుణాలకు పాలు పెట్టింది పేరు. అయితే మనలో చాలా మందికి పాలకు సంబంధించిన కొన్ని అపోహలు ఉంటాయి. ఇంతకీ పాలకు సంబంధించి ఉండే అపోహలు ఏంటి.? వాటిలో నిజం ఎంత ఉంటుంది.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

* పాలు సరిగ్గా జీర్ణం కావని మనలో చాలా మంది భావిస్తుంటారు. అయితే ఆవు పాలలో ప్రొటీన్‌ తక్కువగా ఉంటుంది. కాబట్టి తేలికగానే జీర్ణమవుతాయి. గేదె పాలలో ప్రొటీన్‌ కాస్త ఎక్కువ. అయినా కూడా తేలికగానే జీర్ణమవుతాయి. ఘనాహారం తీసుకోలేనివారికి, ఆహారం సరిగా జీర్ణం కానివారికి పాలు, పెరుగు, మజ్జిగ ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి పాలు జీర్ణం కావు అనేది కేవలం అపోహ మాత్రమే.

* ఇక మనలో చాలా మంది ప్యాకెట్ పాలు మంచివి కావనే భావనలో ఉంటారు. అయితే డెయిరీల్లో పాలను ముందుగానే శుభ్రం చేసి, కొవ్వుశాతం సమానంగా ఉండేలా చేస్తారు. కొద్దిసేపు అత్యధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి, వెంటనే చల్లబరుస్తారు. దీంతో బ్యాక్టీరియా వంటివేవైనా ఉంటే చనిపోతాయి. అందుకే ప్యాకెట్‌లు సురక్షితమైనవే కాకుండా ఇందులో పోషకాలు కూడా ఏం తగ్గవు. కానీ ఇటీవల కొందరు మోసగాళ్లు కల్తీ పాలను తయారు చేసి ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తున్నారు. ఇలాంటి వాటి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి.

* పాలు తాగడం వల్ల బరువు పెరుగుతారని కూడా చాలా మంది విశ్వసిస్తుంటారు. అయితే పాలను మితంగా తీసుకుంటే ఎలాంటి నష్టం వాటిల్లదు. కానీ చిక్కటి పాలు, గడ్డ పెరుగు వంటివి ఎక్కువెక్కువగా తీసుకుంటూ.. వ్యాయామం, శారీరక శ్రమ చేయకపోతే మాత్రం ఒంట్లో కొవ్వు పెరిగే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా రాత్రి పాలు తాగి వెంటనే పడుకుంటే బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి.

* ఇక పాలు తాగితే జలుబు అవుతుంది అనడంలో కూడా నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. నిజానికి పాలు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..