Lifestyle: మీలో ఈ లక్షణాలు ఉన్నాయా.? చక్కెర ఎక్కువగా తీసుకుంటున్నట్లే..

|

Jul 20, 2024 | 7:35 PM

అయితే మనం రోజువారీ చికెన్‌ను ఎక్కువగా తీసుకుంటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని తెలిసిందే. డయాబెటిస్‌ మొదలు మరెన్నో అనారోగ్య సమస్యలకు చక్కెర తీసుకోవడం ప్రభావం చూపుతుంది. అయితే మనం చక్కెర ఎక్కువగా తీసుకుంటున్న విషయాన్ని మన శరీరం ఎప్పటికప్పుడు మనల్ని అలర్ట్ చేస్తూనే ఉంటుంది. ఇంతకీ చక్కెర ఎక్కువగా తీసుకుంటే...

Lifestyle: మీలో ఈ లక్షణాలు ఉన్నాయా.? చక్కెర ఎక్కువగా తీసుకుంటున్నట్లే..
Sugar
Follow us on

ప్రతీ రోజూ మనం తీసుకునే ఆహార పదార్థాల్లో కచ్చితంగా చక్కెర ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉదయం లేవగానే తీసుకునే టీ మొదలు, మధ్యాహ్నం తినే ఐస్‌ క్రీమ్‌ వరకు, రాత్రి డిన్నర్‌ చేసిన తర్వాత తినే ఐస్‌క్రీమ్‌ వరకు అన్నింటిలో చక్కెర కచ్చితంగా ఉండాల్సిందే. అయితే చక్కెర మరీ తక్కువగా తీసుకోవడం వల్ల నష్టాలు ఉండడంతో పాటు, ఎక్కువగా తీసుకుంటే నష్టాలు కూడా ఉంటాయని తెలిసిందే. మనకు తెలియకుండానే చాలా సార్లు చక్కెర మోతాదుకు మించి తీసుకుంటుంటాం.

అయితే మనం రోజువారీ చికెన్‌ను ఎక్కువగా తీసుకుంటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని తెలిసిందే. డయాబెటిస్‌ మొదలు మరెన్నో అనారోగ్య సమస్యలకు చక్కెర తీసుకోవడం ప్రభావం చూపుతుంది. అయితే మనం చక్కెర ఎక్కువగా తీసుకుంటున్న విషయాన్ని మన శరీరం ఎప్పటికప్పుడు మనల్ని అలర్ట్ చేస్తూనే ఉంటుంది. ఇంతకీ చక్కెర ఎక్కువగా తీసుకుంటే శరీరంలో జరిగే ఆ మార్పులకు సంబంధించి ప్రముఖ డాక్టర్‌ రూపే ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు..

* నిత్యం సైనస్‌ సమస్యలతో బాధపడుతుంటే చక్కెర ఎక్కువగా తీసుకుంటున్నట్లే అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మనం తీసుకునే ఆహారం రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపుతుందని తెలిసిందే. చక్కెర ఎక్కువగా తీసుకుంటే అలర్జీ వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

* ఇక నిత్యం ఆకలిగా ఉన్నా మీరు చక్కెర ఎక్కువగా తీసుకుంటున్నారని అర్థం చేసుకోవాలి. తిన్న వెంటనే మళ్లీ ఆకలిగా ఉంటుందంటే మీరు చక్కెర మోతాదుకు మించి తీసుకుంటున్నట్లు లెక్క. నేచర్‌ అనే జర్నల్‌లో ఈ విషయాలను ప్రచురించారు. చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం ఎక్కువ కేలరీలను కోరుకుంటుంది.

* ఎలాంటి పని చేయకపోయినా నిత్యం అలసటతో ఉంటున్నా మీరు మోతాదుకు మించి చక్కర తీసుకుంటున్నారని అర్థం చేసుకోవాలి. అలాగే నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నా మీరు ఎక్కువగా చక్కెర తీసుకుంటున్నారని అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పలు అధ్యయనాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

* తీవ్ర ఒత్తిడి, ఆంక్సైటీ, డిప్రెషన్‌, మూడ్‌ స్వింగ్స్‌ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా మీరు చక్కెర ఎక్కువగా తీసుకుంటున్నట్లు అర్థం చేసుకోవాలి. చక్కెర ఎక్కువగా తీసుకోవడం మానసిక సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

* చక్కెర ఎక్కువగా తీసుకుంటే గట్‌ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పేగుల్లో మంచి బ్యాక్టీరియా తగ్గి, చెడు బ్యాక్టీరియా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..