Cancer: కడుపులో కనిపించే ఈ మార్పులు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు

|

Jun 30, 2024 | 9:31 PM

అయితే కడుపు క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తిస్తే చికిత్స కూడా సులభంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కొన్ని రకాల లక్షణాల ఆధారంగా కడుపు క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కడుపు క్యాన్సర్‌ లక్షణాలు పురుషులతో పాటు మహిళల్లోనూ ఒకే రకంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు...

Cancer: కడుపులో కనిపించే ఈ మార్పులు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు
Stomach Cancer
Follow us on

మారిన జీవన విధానం తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా ఇటీవల క్యాన్సర్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆహారపు అలవాట్లు మారడం, రసాయనాలతో కూడిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం. వంటి వాటి కారణంగా కడుపు క్యాన్సర్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్యాన్సర్‌ రావడానికి జీవనశైలిలో తప్పులు ఒక కారణమైతే, జన్యుపరమైనవి కూడా కారణాలని నిపుణులు చెబుతున్నారు.

అయితే కడుపు క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తిస్తే చికిత్స కూడా సులభంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కొన్ని రకాల లక్షణాల ఆధారంగా కడుపు క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కడుపు క్యాన్సర్‌ లక్షణాలు పురుషులతో పాటు మహిళల్లోనూ ఒకే రకంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. అయితే క్యాన్సర్‌ ప్రారంభమైన తొలి సమయంలో కొన్ని చిన్న లక్షణాల ద్వారా కడుపు క్యాన్సర్‌ను పసిగటవచ్చని చెబుతున్నారు..

ఏ కారణం లేకుండా తరచుగా కడుపు నొప్పి వేధస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. అలాగే ఉన్నట్లుండి ఒక్కసారిగా బరువు తగ్గినా ఏదో తేడా ఉందని అర్థం చేసుకోవాలి. ఇక మలంలో రక్తం పడడం వంటివి కూడా క్యాన్సర్‌కు ముందస్తు లక్షణాలుగా భావించాలి. నిత్యం అలసటా ఉండడం, వికారంగా ఉండడం కూడా క్యాన్సర్‌కు ముందస్తు లక్షణాలుగా భావించాలి. అలాగే కొంచెం ఆహారం తిన్నా కడుపు ఉబ్బిన భావన కలుగుతున్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి. అజీర్ణం సమస్య దీర్ఘకాలంగా వేధిస్తున్నా వెంటనే వైద్యులను సంప్రదించి కడుపు క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలి.

కడుపు క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయలేమా.? అంటే కచ్చితంగా కాదని మాత్రం చెప్పలేం. ఎందుకంటే కడుపు క్యాన్సర్‌ అనేది ప్రాణాంతక వ్యాధి. అయితే మొదటి లేదా రెండో దశలో గుర్తిస్తే నయం చేయడం సులువే. కానీ మూడో దశలో గుర్తిస్తే మాత్రం చికిత్స కష్టంగా మారుతుంది. కాబట్టి పదేపదే కడుపు నొప్పి, అజీర్ణం, ఆకలిలేకపోవడం, మలంలో రక్తం రావడం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..