Diabetes: కాలి మడమల్లో కనిపించే ఈ లక్షణాలు.. డయాబెటిస్‌కు సంకేతం కావొచ్చు

|

Jul 19, 2024 | 8:07 PM

ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్‌ ఒకటి. రోజురోజుకీ ఈ వ్యాధి బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారిలో కనిపించే డయాబెటిస్‌ ఇప్పుడు 30 ఏళ్ల వారిలోనూ కనిపిస్తోంది. మారుతోన్న జీవన విధానం, తీసుకునే ఆహారంలో మార్పుల కారణంగా డయాబెటిస్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది...

Diabetes: కాలి మడమల్లో కనిపించే ఈ లక్షణాలు.. డయాబెటిస్‌కు సంకేతం కావొచ్చు
Diabetes
Follow us on

ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్‌ ఒకటి. రోజురోజుకీ ఈ వ్యాధి బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారిలో కనిపించే డయాబెటిస్‌ ఇప్పుడు 30 ఏళ్ల వారిలోనూ కనిపిస్తోంది. మారుతోన్న జీవన విధానం, తీసుకునే ఆహారంలో మార్పుల కారణంగా డయాబెటిస్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే డయాబెటిస్‌ను ప్రాథమిక దశలో గుర్తిస్తే వ్యాధి నియంత్రణ సులభమవుతుందని నిపుణులు చెబుతుంటారు. శరీరంలో డయాబెటిస్‌ వచ్చిన వెంటనే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వీటిని ముందుగానే పసిగడితే వ్యాధిని కంట్రోల్‌ చేసుకోవచ్చు. అలాంటి ఓ ముందస్తు లక్షణాల్లో ఒకదాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

* మధుమేహం వల్ల రక్త ప్రసరణపై ప్రభావం పడుతుందని తెలిసిందే. ముఖ్యంగా కాళ్లకు రక్త ప్రసరణలో ఇబ్బందులు ఏర్పడుతాయి. దీంతో చర్మం పొడిబారుతుంది. దీని ప్రభావం మడమలపై పడుతుంది. మడమల్లో చీలికల కారణంగా నొప్పి గణనీయంగా పెరుగుతుంది. కొన్నిసార్లు ఇది ఇన్ఫెక్షన్‌కు కూడా కారణం కావచ్చని చెబుతున్నారు.

* డయాబెటిస్‌ కారణంగా మడమలో వాపు, నొప్పి సమస్య వెంటాడుతుంటాయి. దీనివల్ల నడవడానికే కాకుండా నిలబడడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. కాళ్లలో సరైన రక్త సరఫరా లేకపోవడం వల్ల కణజాలం బలహీనంగా మారుతుంది.

* డయాబెటిస్‌ కారణంగా కాళ్ల నరాలు బలహీనపడతాయి. దీంతో మడమల్లో జలదరింపు, తిమ్మిరి, సూదితో కుచ్చుకున్నట్లు భావన కలుగుతుంది. అలాగే పాదాలు లేదా చీలమడంలో గాయాలై త్వరగా నయం కాకపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

మడమ లేదా పాదంలో ఏదైనా సమస్య ఉన్నట్లయితే వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. పాదాలను నిత్యం శుభ్రంగా ఉండాలి. సౌకర్యవంతమైన, సరైన సైజు బూట్లు మాత్రమే ధరించాలి. ఎప్పటికప్పుడు షుగర్‌ లెవల్స్‌ని పరీక్షించుకోవాలి. మధుమేహాన్ని కంట్రోల్‌ చేసుకోవాలంటే నిత్యం తగినంత నీరు తాగాలి. స్వీట్లకు దూరంగా ఉండాలి. సమయానికి మందులు తీసుకోండి. ఉప్పు తక్కువగా తీసుకోవాలి, ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉండే ఫుడ్‌ను తీసుకోవాలి. రోజూ వ్యాయాయం చేయడాన్ని అలవాటు చేసుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి…