Lifestyle: జిమ్‌కి వెళ్లే వారు ఈ విషయాలు మస్ట్‌గా తెలుసుకోండి.. బీ కేర్‌ఫుల్

|

Aug 12, 2024 | 4:44 PM

ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో జీవన శైలి కూడా అంతే ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఆహారంలో జాగ్రత్తలు తీసుకుంటేనే, జీవనశైలిలో కూడా మార్పులు చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా కరోనా తర్వాత ప్రతీ ఒక్కరిలో ఆరోగ్యంపై ఆసక్తి పెరిగింది. దీంతో అప్పటి వరకు వాకింగ్ అలవాటు లేని వారు కూడా వాకింగ్‌ చేస్తున్నారు....

Lifestyle: జిమ్‌కి వెళ్లే వారు ఈ విషయాలు మస్ట్‌గా తెలుసుకోండి.. బీ కేర్‌ఫుల్
Gym
Follow us on

ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో జీవన శైలి కూడా అంతే ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఆహారంలో జాగ్రత్తలు తీసుకుంటేనే, జీవనశైలిలో కూడా మార్పులు చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా కరోనా తర్వాత ప్రతీ ఒక్కరిలో ఆరోగ్యంపై ఆసక్తి పెరిగింది. దీంతో అప్పటి వరకు వాకింగ్ అలవాటు లేని వారు కూడా వాకింగ్‌ చేస్తున్నారు. జిమ్‌లకు వెళ్లని వారు కూడా జిమ్‌లలో కుస్తీలు పడుతున్నారు.

అయితే జిమ్‌కి వెళ్తే శారీరకంగా ఫిట్‌గా మారుతామని మనందరికీ తెలిసిందే. అయితే జిమ్స్‌లో మనం చేసే కొన్ని తప్పులు, ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం చేసే విధానంలో చేసే తప్పులు ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ తప్పులు ఏంటి.? జిమ్‌ వల్ల కలిగే దుష్ప్రభావాల నుంచి ఎలా బయటపడాలి ఇప్పుడు తెలుసుకుందాం..

* సాధారణంగా జిమ్‌లో బరువులు ఎత్తే సమయంలో కండరాల్లో తిమ్మిరి వంటి భావన కలుగుతుంది. అయితే మోతాదుకు మించి బరువులు ఎత్తితే కండరాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇది నొప్పి, వారు, కండరాల బలహీనతకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే జిమ్‌ ట్రైయినర్‌ సూచన మేరకు మీరు ఎంత బరువు ఎత్తాలో తెలుసుకొనే ఎత్తండి.

* తప్పుడు విధానంలో వ్యాయామం చేయడం వల్ల కీళ్లపై ఒత్తిడి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కీళ్లలో నొప్పి లేదా వాపు వంటి సమస్యలు వస్తాయి. మోకాలు, భుజాలపై ప్రభావం చూపుతుంది. దీని బారిన పడకుండా ఉండాలంటే సరైన భంగిమలో వ్యాయామం చేయాలి.

* జిమ్‌లో కార్డియో సంబంధిత వ్యాయామాలు చేయడం వల్ల గుండెపై ఒత్తిడి పెరుగుతుంది, ఇది గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీకు ఇప్పటికే గుండె సంబంధిత సమస్య ఉంటే, జిమ్‌లో వ్యాయామం చేసే ముందు వైద్యులను సంప్రదించడం మర్చిపోకండి. అలాగే జిమ్‌లో వ్యాయామం చేసే సమయంలో ఎప్పటికప్పుడు మీ హార్ట్‌ బీట్‌ను చెక్‌ చేసుకోండి.

* జిమ్‌లో గంటల తరబడి కసరత్తులు చేయడం వల్ల చెమట ఎక్కువగా పట్టే అవకాశం ఉంటుంది. ఇది డీహైడ్రేషన్‌ సమస్యకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో తలతిరగడం, తలనొప్పి వంటి సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి నిత్యం హైడ్రేట్‌గా ఉండేందుకు ప్రయత్నించాలి.

ఇవి పాటించండి..

వ్యాయామం చేసే సమయంలో ఎలాంటి సమస్యలు రావొద్దంటే.. సరైన టెక్నిక్‌, పొజిషన్స్‌ గురించి తెలుసుకోవాలి. అలాగే వ్యాయామం ప్రారంభించే ముందు కచ్చితంగా వామప్‌ చేయడం మర్చిపోకూడదు. మీ శారీరక సామర్థ్యానికి అనుగుణంగా మాత్రమే వ్యాయామం చేయండి. అవసరానికి మించి కష్టపడితే నష్టం తప్పదు. ఎట్టి పరిస్థితుల్లో డీహైడ్రేషన్‌కు గురి కాకుండా చూసుకోవాలి. ఇక అన్నింటికంటే ముఖ్యంగా ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే జిమ్‌ ఆపేసి కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. బలవంతంగా చేయకూడదు.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..