Lifestyle: రాత్రి పడుకునే ముందు అరికాళ్లు మసాజ్‌ చేస్తే.. ఎన్ని లాభాలో తెలుసా.?

|

May 12, 2024 | 5:43 PM

మసాజ్‌ వల్ల ఎన్ని రకాల ఉపయోగాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒత్తిడికి గురైన శరీరానికి రిలాక్స్‌ కావడానికి ఉపయోగపడుతుంది. అందుకే చాలా మంది మసాజ్‌ సెంటర్స్‌కి వెళ్తూ రిలాక్స్‌ అవుతున్నారు. అయితే వీటన్నింటితో పాటు అరికాళ్లను మసాజ్‌ చేయడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా.?

Lifestyle: రాత్రి పడుకునే ముందు అరికాళ్లు మసాజ్‌ చేస్తే.. ఎన్ని లాభాలో తెలుసా.?
Foot Massage
Follow us on

మసాజ్‌ వల్ల ఎన్ని రకాల ఉపయోగాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒత్తిడికి గురైన శరీరానికి రిలాక్స్‌ కావడానికి ఉపయోగపడుతుంది. అందుకే చాలా మంది మసాజ్‌ సెంటర్స్‌కి వెళ్తూ రిలాక్స్‌ అవుతున్నారు. అయితే వీటన్నింటితో పాటు అరికాళ్లను మసాజ్‌ చేయడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా.? ముఖ్యంగా రాత్రి పడుకునే ముందకు ప్రతీ రోజూ అరికాళ్లను మసాజ్‌ చేసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ అరికాళ్లను మసాజ్‌ చేసుకోవడం ద్వారా కలిగే ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* అరికాళ్లను క్రమం తప్పకుండా మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. శరీరంలోని అన్ని భాగాలకు రక్త సరఫరా అవుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు, గుండె సమస్యలతో బాధపడేవారికి అరికాళ్ల మసాజ్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది.

* అరికాళ్ల మసాజ్‌తో కీళ్ల నొప్పులు, వాపులు కూడా తగ్గుతాయి. నువ్వుల నూనెతో మసాజ్‌ చేసుకుంటే మరీ మంచిది. నువ్వుల నూనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇవి నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.

* రోజూ పడుకునే ముందు అరికాళ్లకు మసాజ్ చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మసాజ్ శరీరంలో సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది, ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది, శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది. దీంతో మంచి నిద్ర సొంతం చేసుకోవచ్చు.

* నెలసరి సమయంలో వచ్చే నొప్పులకు కూడా అరికాళ్ల మసాజ్‌తో చెక్‌ పెట్టొచ్చు. ముఖ్యంగా కడుపులో తిమ్మిరి వంటి సమస్యలకు ఈ టెక్నిక్‌తో చెక్‌ పెట్టొచ్చు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..