Summer Tips: చెరుకు రసం Vs కొబ్బరి నీళ్లు.. సమ్మర్‌ హీట్‌ నుంచి ఉపశమనం పొందేందుకు ఏది బెస్ట్!

బయట ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ క్రమంలో జనాలు అలసట, నీరసం, డీహైడ్రేషన్ వంటి సమస్యలను ఎదుర్కొంటారు. అయితే వీటి నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది కొబ్బరి నీళ్లు, చెరుకు రసం తాగుతూ ఉంటారు. వేసవి తాపాన్ని తట్టుకోవడానికి, శరీరాన్ని హైడ్రేటెడ్ ఉంచుకోవడానికి ఈ రెండు అద్భుతమైన పానీయాలు. అయితే వీటిలో ఏది ఎప్పుడు తీసుకోవాలి, వేటి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Summer Tips: చెరుకు రసం Vs కొబ్బరి నీళ్లు.. సమ్మర్‌ హీట్‌ నుంచి ఉపశమనం పొందేందుకు ఏది బెస్ట్!
Coconut Water Vs Sugarcane Juice
Image Credit source: pinrest

Updated on: Apr 23, 2026 | 8:57 AM

రోజురోజుకూ పెరుగుతున్న వేసవి వేడితో, శరీరంలో అలసట, డీహైడ్రేషన్ వంటి సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది. దీని కారణంగా, ప్రజలు వేడిని తగ్గించుకోవడానికి, శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి సహజ పానీయాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా వేసవిలో కొబ్బరి నీళ్లు, చెరకు రసం తాగేందకు జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ రెండు పానీయాలు శరీరానికి వివిధ ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ, వీటిలో ఏది మంచిది, ఏది ఎక్కువ ప్రయోజకరంగా ఉంటుందనే ప్రశ్న చాలా మందిలో ఉంది.

చెరకు రసం ప్రయోజనాలు

చెరకు రసం పూర్తిగా సహజమైన పానీయం. ఎండలో తిరిగి బాగా అలసిపోయిన వారికి ఇది ఒక వరం లాంటిదనే చెప్పాలి. ఇది తాగిన వెంటనే శరీరానికి కావాల్సిన గ్లూకోజ్‌ను అందించి, తక్షణ శక్తిని ఇస్తుంది. అలాగే శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపి, కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది.వేసవిలో వడదెబ్బ నుంచి రక్షిస్తుంది. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి.

కొబ్బరి నీళ్లు ప్రయోజనాలు

కొబ్బరి నీళ్లు మన శరీరంలోని నీటి శాతాన్ని పెంచడంలో సూపర్‌గా పనిచేస్తాయి. ఎండలో తిరగడం వల్ల శరీరం కోల్పోయిన లవణాలను, నీటిని ఇది వెంటనే ఇది భర్తీ చేస్తుంది. అసిడిటీ వంటి సమస్యలను తగ్గించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఉదయాన్నే పరగడుపున తాగితే బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాదు రక్తపోటును క్రమబద్ధీకరించడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

రెండింటిలో ఏది బెస్ట్

రెండింటిలో ఏది మంచిది అనే విషయానికి వస్తే అది మీ అవసరాన్ని బట్టి మారుతుంది. మీరు చాలా అలసటగా ఉండి, వెంటనే శక్తి కావాలంటే చెరకు రసం ఉత్తమ డ్రింక్ అవుతుంది. లేదా మీకు శరీరం చల్లబడాలి, డీహైడ్రేషన్ తగ్గాలి అనుకుంటే కొబ్బరి నీళ్లు చాలా బాగా పనిచేస్తాయి. మొత్తానికి, ఈ వేసవిలో ఈ రెండింటిని మీ అవసరానికి తగినట్లుగా మితంగా తీసుకుంటే మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు.

Note: చెరకు రసంలో సహజ చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, షుగర్ ఉన్న వారు దీనికి దూరంగా ఉండటం లేదా చాలా తక్కువగా తీసుకోవడం మంచిది. ఇలాంటి వ్యక్తులు కొబ్బరి నీళ్లు తాగడం చాలా మంచింది. పైన పేర్కొన్న సమాచారం ఇంటర్నెట్, లేదా నివేదికల ఆధారంగా అందించబడింది. వీటిని Tv9 దృవీకరించడం లేదు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us