మద్యం తాగినా.. ఆరోగ్యాన్ని కాపాడుకోండిలా..!

|

Nov 08, 2020 | 11:58 PM

టైటిల్‌ను చూసి షాక్ అవుతున్నారా..? ఎవరైనా మద్యం సేవిస్తే.. ఆరోగ్యం పాడవుతుందని అంటారు. ఇక్కడేంటి కాపాడుకోవచ్చు అని చెబుతున్నానని

మద్యం తాగినా.. ఆరోగ్యాన్ని కాపాడుకోండిలా..!
Follow us on

Best Foods While Drinking: టైటిల్‌ను చూసి షాక్ అవుతున్నారా..? ఎవరైనా మద్యం సేవిస్తే.. ఆరోగ్యం పాడవుతుందని అంటారు. ఇక్కడేంటి కాపాడుకోవచ్చు అని చెబుతున్నానని అనుకుంటున్నారా.? అక్కడికే వస్తున్నానండీ.. మనం మితంగా భోజనం తింటే అంతా బాగుంటుంది. అదే అమితంగా తింటే.. లేని పోనీ ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇలా ఏదైనా మితంగా తింటేనే మంచిదని పెద్దలు చెబుతుంటారు. అలాగే మితంగా మద్యం సేవిస్తే.. నష్టాలు కంటే.. లాభాలే ఎక్కువ ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇక మితంగా మద్యం సేవించడంతో ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

రోజుకి లెక్కలేసుకుని మందు తాగే రోజులు పోయాయి. ఇప్పుడు మందుబాబులు సందు దొరికితే చాలు.. మద్యం షాపుల్లో బాటిళ్లకు బాటిళ్లు తాగేస్తుంటారు. ఎక్కువ మంది చీప్ లిక్కర్ తాగుతుండటంతో లేనిపోని రోగాలు వస్తుంటాయి. అందుకే డాక్టర్లు మితంగా మద్యం సేవిస్తే మంచిదని సలహా ఇస్తుంటారు. ఇక మితంగా రోజుకు ఓ పెగ్ మందు పుచ్చుకునే వాళ్ళు ఎక్కువగా గ్రీన్ టీను అలవాటు చేసుకుంటే ఇంకా మంచిదని వారి అభిప్రాయం. గ్రీన్ టీలో తన్నిన్స్, కటేచిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల.. అవి లివర్‌ను ఆరోగ్యకరంగా ఉంచుతాయి. మరోవైపు మద్యం సేవించే వాళ్లకు ఎప్పుడూ జీర్ణాశయంలో మంట ఉంటుంది. ఇది తగ్గడానికి రోజుకు ఓ ఆపిల్‌ను తింటే.. అందులో ఉండే పెక్టిన్ అనే కెమికల్ మంట నుంచి ఉపశమనం కలిగిస్తుంది.