
చలిగాలుల్లో గాలిలో తేమ శాతం తగ్గుతుంది. దీంతో జుట్టు సహజ తేమను కోల్పోయి పొడిబారుతుంది. జుట్టు దువ్వుకునేటప్పుడు, ఉన్ని దుస్తులకు రుద్దుకున్నప్పుడు స్థిర విద్యుత్ (స్టాటిక్ ఎలక్ట్రిసిటీ) ఏర్పడుతుంది. ఫలితంగా వెంట్రుకలు ఒకదానికొకటి లేదా బట్టలకు అంటుకుంటాయి.
జుట్టు మరీ పొడిగా అనిపిస్తే తలస్నానం చేసిన తర్వాత మంచి కండిషనర్ ఉపయోగించాలి. అలాగే జుట్టు చివర్లకు కొద్దిగా లీవ్-ఇన్ కండిషనర్ లేదా హెయిర్ సీరమ్ రాయడం వల్ల తేమ నిలిచి ఉంటుంది. దీంతో జుట్టు ఎగిరిపోవడం, బట్టలకు అంటుకోవడం తగ్గుతుంది.
మరీ వేడి నీటితో తలస్నానం చేయకండి.
తరచూ హెయిర్ డ్రయ్యర్ ఉపయోగించకుండా ఉండండి.
జుట్టును బలంగా రుద్దకుండా మృదువైన టవల్‌తో ఆరబెట్టండి.
ప్లాస్టిక్ దువ్వెనకు బదులుగా చెక్క దువ్వెన ఉపయోగించవచ్చు.
జుట్టు తేమను కాపాడేందుకు తగిన కండిషనర్ వాడండి.
గమనిక: జుట్టు సమస్యలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. మీ జుట్టు రకానికి సరిపోయే ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించండి.