జొన్నచెంచలితో మోకాలి నొప్పులు మాయం !

|

Aug 19, 2019 | 3:10 PM

కూరల్లో ఆకుకూరలు వేరయా..! అన్నట్లుగా అన్ని కూరగాయల్లో కెల్లా ఆకు కూరలది అత్యంత ప్రత్యేక స్థానం. ఆకు కూరల గురించి సపరేటుగా చెప్పుకోనవసరం లేదు.ప్రతిరోజూ మధ్యాహ్నా భోజనంలో ఆకు కూర తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని పౌషికాహార నిపుణులు, వైద్యులు చెబుతుంటారు. అయితే, ఎరువులు ఉపయోగించని పంట పొలాల్లో వాటంతట అవి మొలిచే ఎంతో విలువైన పాతకాలపు ఆకుకూరలు, ఔషద మొక్కలను ఈ తరం వారు కలుపు మొక్కలుగా తీసిపారేస్తున్నారు. అలా మరుగున పడ్డ ఆకుకూరలు వాటి అవశ్యకతను […]

జొన్నచెంచలితో మోకాలి నొప్పులు మాయం !
Follow us on

కూరల్లో ఆకుకూరలు వేరయా..! అన్నట్లుగా అన్ని కూరగాయల్లో కెల్లా ఆకు కూరలది అత్యంత ప్రత్యేక స్థానం. ఆకు కూరల గురించి సపరేటుగా చెప్పుకోనవసరం లేదు.ప్రతిరోజూ మధ్యాహ్నా భోజనంలో ఆకు కూర తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని పౌషికాహార నిపుణులు, వైద్యులు చెబుతుంటారు. అయితే, ఎరువులు ఉపయోగించని పంట పొలాల్లో వాటంతట అవి మొలిచే ఎంతో విలువైన పాతకాలపు ఆకుకూరలు, ఔషద మొక్కలను ఈ తరం వారు కలుపు మొక్కలుగా తీసిపారేస్తున్నారు. అలా మరుగున పడ్డ ఆకుకూరలు వాటి అవశ్యకతను వివరిస్తూ సంగారెడ్డి జిల్లాలో ప్రత్యేకించి ఆకుకూరల పండగ నిర్వహించారు.

జిల్లాలోని జహీరాబాద్‌ ప్రాంత మహిళా రైతులు తమ మెట్టపొలాల్లో చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు,నూనె గింజల పంటలతో పాటు దాదాపు 150 రకాల ఆకుకూరలు, ఔషధ మొక్కలను పదిలంగా కాపాడుకుంటున్నారు. వీటికి సాగు చేయని ఆకు కూరలని పేరు. అరుదైన ఈ మొక్కలను గుర్తించి, పెంచి, వండుకుని తినడం ద్వారా  పౌషికాహార లోపం లేకుండా జీవించవచ్చని చెప్పారు. ప్రత్యేకంగా జొన్నచెంచలి అని పిలువబడే ఆకుకూరతో ప్రస్తుత కాలంలో అందరిని వెంటాడుతున్న మోకాలి సమస్యలు తొలగిపోతాయంటున్నారు రైతులు. అరుదైన ఈ సంప్రదాయ వ్యవసాయ సంస్కృతిలో అంతర్భాగమైన ఈ అరుదైన ఆకుకూరల గురించి రైతులకు, పట్టణ నగర ప్రజలకు తెలియజేసేందుకు డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ ఏటా ఈ ఆకుకూరల పండగ నిర్వహిస్తోంది. ఈ పండగలో పాల్గొనేందుకు తెలంగాణ, ఏపీ తెలుగు రాష్ట్రాలతో పాటుగా పక్క రాష్ట్రం కర్నాటక, మహారాష్ట్రాల నుంచి కూడా రైతులు,వినియోగదారులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.