Sleeping Tips: ఈ ఆహారాలు తినండి.. రాత్రి హాయిగా, గాఢంగా నిద్రపోండి..

|

Jul 07, 2022 | 6:22 AM

Sleeping Tips: మంచి నిద్ర అనేది దేవుడు ఇచ్చిన బహుమతి. అయితే, అందరూ ఈ అదృష్టాన్ని పొందలేరు. చాలా తక్కువ మంది గాఢ నిద్రను..

Sleeping Tips: ఈ ఆహారాలు తినండి.. రాత్రి హాయిగా, గాఢంగా నిద్రపోండి..
Sleeping
Follow us on

Sleeping Tips: మంచి నిద్ర అనేది దేవుడు ఇచ్చిన బహుమతి. అయితే, అందరూ ఈ అదృష్టాన్ని పొందలేరు. చాలా తక్కువ మంది గాఢ నిద్రను ఆస్వాధిస్తారు. అదే సమయంలో ఎక్కువ మంది అరకొరగా నిద్రపోతుంటారు. రాత్రి పడుకున్నప్పటికీ.. మధ్య మధ్యలో అనేకసార్లు లేస్తుంటారు. మెలటోనిన్, స్లీప్ హార్మోన్లు మంచి నిద్రను ప్రోత్సహిస్తాయి. చీకటి గదిలో పడుకుంటే.. ఈ హార్మోన్ల ప్రభావం తక్కువగా ఉంటుంది. అదే వెలుతురు ఉన్న గదిలో ఉంటే.. ఈ హార్మోన్లు ఎక్కువగా పని చేస్తాయి. మంచి నిద్ర కోసం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు.. వ్యాయామం కూడా క్రమం తప్పకుండా చేయాలి. బాగా నిద్రపోవడానికి సహాయపడే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

పాలు: పడుకునే ముందు ఒక గ్లాసు పాలు తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆవు పాలలో మెలటోనిన్ అధిక స్థాయిలో ఉంటుంది. ఇది రాత్రిపూట ఎటువంటి సమస్యలు లేకుండా హాయిగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.

అరటిపండు : అరటిపండులో మెలటోనిన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అరటిపండులో ఉండే విటమిన్ బి6, మెగ్నీషియం మంచి నిద్రకు దారి తీస్తుంది.

నట్స్: బాదం, పిస్తా, జీడిపప్పు వంటి అన్ని రకాల నట్స్‌లో మెలటోనిన్, మెగ్నీషియం ఉన్నాయి. ఇవి రాత్రిపూట తింటే మంచి నిద్ర వస్తుంది.

గుడ్లు: గుడ్లలో ప్రోటీన్, ఐరన్, మంచి కొవ్వులు ఉంటాయి. ఇవి మంచి నిద్రకు సహాయపడతాయి. అల్జీమర్స్, పార్కిన్సన్స్, దృష్టి లోపానికి సంబంధించిన వ్యాధులు దూరంగా ఉంచుతాయి.

చేపలు: సాల్మన్, సార్డినెస్, ట్రౌట్‌లలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, మెలటిన్ ఉంటాయి. మంచి నిద్ర, గుండె ఆరోగ్యాన్ని, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

 

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..