Beauty Care Tips: ఈ పువ్వు పూజకు మాత్రమే కాదు.. మంచి బ్యూటీ కేర్ ప్రొడక్ట్.. ఒత్తైన జుట్టుకోసం ఎలా వాడాలంటే

|

Sep 07, 2024 | 5:12 PM

పండగలు, శుభకార్యాల్లో మాత్రమే కాదు రోజూ పూజలో పువ్వులను తప్పని సరిగా ఉపయోగిస్తారు. మందారం, చామంతి, బంతిపువ్వు వంటి రకరకాల పువ్వులతో పూజ చేస్తారు. ఈ రోజు వినాయక చవితి పండుగను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భక్తులు తమ ఇళ్లలో, దేవాలయాలలో వినాయకుడిని రకరకాల వస్తువులతో పూజలు చేస్తున్నారు. కలువ పువ్వు, చామంతి వంటి పువ్వులతో పాటు పత్రి, దూపం, దీపం నైవేద్యాలతో పూజలను చేస్తున్నారు. అయితే గణపతికి పసుపు, ఎరుపు రంగు వంటి వస్తువులను వినాయకుడికి సమర్పిస్తారు.

1 / 5
ఈ రోజు గణపతికి మందార పువ్వుతో పూజ చేయడం అత్యంత ఫలప్రదం అని నమ్మకం. మందార పువ్వు పూజకు మాత్రమే కాదు దీనిలో ఔషద గుణాలున్నాయి. ఈ పువ్వులో అనేక రకాల పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి, జుట్టుకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది.

2 / 5
చర్మం కోసం ఫేస్ ప్యాక్: మందార పువ్వులను ఉపయోగించి మెరిసే చర్మాన్ని పొందవచ్చు. మందార పువ్వును మెత్తగా చేసి దానిలో రోజ్ వాటర్ కలుపుకుని చర్మానికి అప్లై చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది.

3 / 5
టోనర్: మంచి స్కిన్ టోనర్ కూడా.. దీని కోసం మీరు మందార పువ్వులను నీటిలో ఉడకబెట్టి.. చల్లారిన తర్వాత టోనర్‌గా ఉపయోగించవచ్చు.

4 / 5
జుట్టు కోసం: మంచి ఒత్తైన జుట్టు కోసం హెయిర్ మాస్క్‌గా మందార పువ్వులను ఉపయోగించవచ్చు. మందార పువ్వులో కొబ్బరి నూనె లేదా పెరుగును జోడించి 25 నుండి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఈ పేస్ట్ జుట్టును మృదువుగా, మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది.

5 / 5