వర్షాకాలంలో నెయ్యితో ఉపయోగాలు బోలెడు.. జీర్ణక్రియను మెరుగు పరచటంతోపాటు ఆరోగ్యానికి..

|

Jul 19, 2024 | 6:48 PM

వర్షాకాలంలో చర్మ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. దురద, దద్దుర్లు, మొటిమల సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి.. గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల చర్మ సమస్యలు పెరుగుతాయి. కానీ, నెయ్యి రాసుకోవడం వల్ల ఇలాంటి చర్మ సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు అంటున్నారు నిపుణులు. నెయ్యి అన్ని చర్మ సమస్యలను దూరం చేయడంలో దివ్యౌషధంగా పనిచేస్తుంది.

1 / 5
నెయ్యిలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి సూర్యరశ్మి, కాలుష్యం నుండి చర్మాన్ని కాపాడతాయి. నెయ్యి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తుంది. క్రమం తప్పకుండా రెండు చుక్కల నెయ్యితో చర్మాన్ని మసాజ్ చేసుకోవటం వల్ల నెయ్యి మీ చర్మాన్ని తేమగా మార్చడంలో సహాయపడుతుంది. పెదవులు పగిలిపోవడం, చర్మం దురద వంటి సమస్యలన్నింటినీ నెయ్యి నయం చేస్తుంది.

2 / 5
ముఖంపై ఏర్పడిన నల్లటి వలయాలను తొలగించేందుకు నెయ్యి ఉపయోగపడుతుంది. రాత్రి పడుకునే ముందు రెండు చుక్కల నెయ్యి తీసుకుని కళ్ల చుట్టూ బాగా మసాజ్ చేసుకోవాలి.. ఈ ట్రిక్ కంటి ఉబ్బరాన్ని కూడా తొలగిస్తుంది. ఈ వర్షాకాలంలో పాదాల సంరక్షణ చాలా ముఖ్యం. కొంతమందికి ఏడాది పొడవునా పాదాలు పగుళ్లు ఏర్పడతాయి. ఇది పాదాల అంటువ్యాధికి దారితీస్తుంది. కాబట్టి పగిలిన పాదాలకు చికిత్స చేయడానికి నెయ్యిని ఉపయోగించండి. చీలమండల మీద నెయ్యి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

3 / 5
వర్షాకాలంలో చర్మం దురదను తగ్గించడానికి నెయ్యిని ఉపయోగించవచ్చు. స్నానం చేసేటప్పుడు నెయ్యితో చేసిన బాడీ స్క్రబ్‌ని అప్లై చేసుకోండి. నెయ్యి, కాఫీ, కొబ్బరి నూనె,శెనగపిండితో స్క్రబ్ తయారు చేసుకుని, దానితో వృత్తాకార కదలికలో చర్మాన్ని స్క్రబ్ చేయండి. ఇది చర్మ సంరక్షణలో చక్కటి ఫలితానిస్తుంది. నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా, చర్మంపై ముడతలు రాకుండా కాపాడుతుంది. ఇది సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.

4 / 5
జుట్టు, శిరోజాల సంరక్షణ కోసం నెయ్యిని ఉపయోగించవచ్చు.. కొబ్బరి నూనెలో నెయ్యి మిక్స్ చేసి జుట్టు, తలకు పట్టించాలి. 20-25 నిమిషాలు అలాగే ఉంచి షాంపూతో తలస్నానం చేయాలి. ఇది జుట్టును మృదువుగా, కాంతివంతంగా చేస్తుంది.

5 / 5
ఇంటి పనులన్నీ ఒంటరిగా నిర్వహించే ఆడవాళ్లు.. గిన్నెలు కడగడం, బట్టలు ఉతకడం వంటి పనులతో చేతి చర్మం దెబ్బతింటుంది. రాత్రి పడుకునే ముందు రెండు చేతులను నెయ్యితో బాగా మసాజ్ చేయాలి. నెయ్యి హ్యాండ్ క్రీమ్‌గా కూడా పనిచేస్తుంది. తరచూ ఇలా చేతులకు నెయ్యిని రాస్తూ ఉంటే.. మీ చేతులు కూడా మృదువుగా మారుతాయి.