
జుట్టు సంరక్షణలో బియ్యం నీళ్ళు, మెంతుల మిశ్రమం ఎంతో ప్రజాదరణ పొందుతోంది. కొరియన్ల కేశ సంరక్షణ రహస్యమైన బియ్యం నీటితో మన సాంప్రదాయ మెంతి గింజలు చేరడం వల్ల జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా పెరుగుతుంది. ఈ రెండింటినీ నానబెట్టి ఆ నీటిని తలకు స్ప్రే చేయడం వల్ల జుట్టుకు సహజమైన కండిషనింగ్ లభించి, కుదుళ్లు దృఢంగా మారి జుట్టు పొడవుగా పెరుగుతుంది. పూర్తి ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..
బియ్యం నీటి ప్రయోజనాలు: బియ్యం నీటిలో విటమిన్ బి, ఇ, అమినో ఆమ్లాలు, ఇనోసిటాల్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి దెబ్బతిన్న జుట్టు కుదుళ్లను పునరుద్ధరించి, జుట్టు విరిగిపోకుండా బలాన్ని అందిస్తాయి.
మెంతుల ప్రయోజనాలు: మెంతులలో ఐరన్, ప్రొటీన్, ఫ్లేవనాయిడ్లు, నికోటినిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని తక్షణమే తగ్గించి, తలలో వచ్చే దురద, చుండ్రును శాశ్వతంగా దూరం చేస్తాయి.
తయారు చేసే విధానం: అర కప్పు బియ్యాన్ని తీసుకుని నీటితో శుభ్రంగా కడగాలి. ఒక గిన్నెలో కడిగిన బియ్యం, 2 టీస్పూన్ల మెంతులు వేసి, 2 కప్పుల నీళ్ళు పోసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని మాత్రమే వేరు చేసి వడకట్టుకోవాలి. మరింత ఎక్కువ పోషకాల కోసం ఈ నీటిని 24 గంటల పాటు పులియబెట్టి కూడా వాడవచ్చు. ఈ నీటిని ఒక స్ప్రే సీసాలో పోసి ఫ్రిజ్‌లో ఉంచుకోవచ్చు.
ఎలా ఉపయోగించాలి? తలస్నానం చేయడానికి అర గంట ముందు ఈ నీటిని తల కుదుళ్లకు, జుట్టు అంతటికీ బాగా స్ప్రే చేయాలి. ఆ తర్వాత వేలికొనలతో తేలికగా మసాజ్ చేసి, 30 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి 1 నుండి 2 సార్లు మాత్రమే ఈ పద్ధతిని పాటించడం శ్రేయస్కరం. ఈ సహజ మిశ్రమం జుట్టుకు మంచి కండిషనర్‌గా పనిచేసి, కేశాలను మెరిసేలా చేస్తుంది. క్రమం తప్పకుండా వాడటం వల్ల జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..