రెండు చేతులు కలిపే విదానాన్ని బట్టి.. మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు.. ఎలా అంటే?

Personality Test: ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలి అంటే జోతిష్యం లేదా అతని ప్రవర్తన ద్వారా తెలుసుకోవచ్చని అందిరికి తెలుసు. కానీ మన శరీర భాగాల ఆకారాలు కూడా మన వ్యక్తిత్వాన్ని, మన అభిరుచులను తెలియజేస్తామని మీకు తెలుసా?.. అయితే ఇవాళ్టి వ్యక్తిత్వ పరీక్షలో రెండు చేతులు కలిపినప్పుడు బొటనవేలు ఉండే విధాన్ని బట్టి ఒకరి వ్యక్తిత్వాన్ని ఎలా అంచనా వేయవచ్చో తెలుసుకుందాం.

రెండు చేతులు కలిపే విదానాన్ని బట్టి.. మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు.. ఎలా అంటే?
Thumb Clasped Meaning

Updated on: Apr 05, 2026 | 8:37 PM

ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంటుంది. ఒక వ్యక్తి ప్రవర్తన,నడవడికను బట్టి వారు ఎలాంటి వారో మనం ఒక నిర్ణయానికి రావచ్చు. అదేవిధంగా, శరీరంలోని ప్రతి భాగం ఆకృతి ఆ వ్యక్తి సామర్థ్యం, బలహీనతలు, ప్రవర్తనను వెల్లడిస్తుంది. ముఖ్యంగా రెండు చేతులను కలిపి పట్టుకున్నప్పుడు బొటనవేలు ఉండే విధానం వారి రహస్య వ్యక్తిత్వాన్ని బయటపెడుతుంది.

మీ బొనవేలు స్థానాన్ని బట్టి మీ వ్యక్తిత్వాన్ని తెలుసుకోండి

కుడి బొటనవేలు ఎడమ బొటనవేలు పైన ఉంటే: రెండు చేతులను కలిపినప్పుడు కుడి చేతి బొటనవేలు, ఎడమ చేతి బొటనవేలు పైన ఉంటే, అటువంటి వారు విశిష్టమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరిలో నాయకత్వ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇతరులకు సహాయం చేసే మనస్తత్వం కలిగి ఉంటారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచిస్తారు. వీరు చాలా ప్రాక్టికల్‌గా ఉంటారు. వ్యాపారాల్లో లాభనష్టాలను ముందే ఊహించే సామర్థ్యం వీరికి ఉంటుంది. తమ జీవితంలోని వ్యక్తిగత విషయాలను లేదా రహస్యాలను ఎవరికీ చెప్పకుండా తమలోనే దాచుకుంటారు.

ఎడమ బొటనవేలు కుడి బొటనవేలు పైన ఉంటే: రెండు చేతులు జోడించినప్పుడు ఎడమ బొటనవేలు పైన ఉంటే, అలాంటి వారు చాలా అరుదైన వ్యక్తులుగా పరిగణించబడతారు. ఈ వ్యక్తులు తమ మనసులో ఉన్నది ఉన్నట్లుగా నేరుగా చెప్పే స్వభావం కలిగి ఉంటారు. తమ భావాలను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడతారు. అలాగే వీరు చాలా దయాగుణం కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు.తమ చుట్టూ ఉన్నవారిని ఎప్పుడూ సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే వారికి వెన్నుదన్నుగా నిలుస్తారు.

రెండు బొటనవేళ్లు సమాంతరంగా ఉంటే: రెండు చేతులు కలిపినప్పుడు రెండు బొటనవేళ్లు ఒకదానికొకటి సమాంతరంగా లేదా నేరుగా ఉంటే వారు చాలా సౌమ్యులు అని అర్థం. వీరు అందరి మాటలను శ్రద్ధగా వింటారు. ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తారు. అలాగే ఇలాంటి వ్యక్తులు చాలా నిజాయితీగా ఉంటారు. తమ సూటి మాటలతోనే అందరికీ నచ్చుతారు. ఏ పని చేపట్టినా అందులో విజయం సాధిస్తారు. ఈ వ్యక్తులు చిన్న చిన్న విషయాల పట్ల కూడా శ్రద్ధ వహిస్తారు. ఎంతటి ఒత్తిడి ఉన్నా ప్రశాంతంగా పనులు పూర్తి చేస్తారు. తమతో ఉండేవారి పట్ల ఎంతో నిబద్ధత, విశ్వాసంతో ఉంటారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us