Lifestyle: మీక్కూడా తినగానే ఈ అలవాటు ఉందా.? దంతాలు డేంజర్‌లో పడ్డట్లే..

| Edited By: Ravi Kiran

Mar 03, 2024 | 10:25 PM

అయితే మొదట్లో ఏదో అవసరానికి ఉపయోగించిన ఈ టూత్‌ పిక్స్‌ కాల క్రమేణా ఓ అలవాటుగా మారిపోతుంది. అసవరం ఉన్నా లేకున్నా టూత్‌ పిక్స్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల దంతాలకు జరిగే మేలు కంటే కీడే ఎక్కువని నిపుణులు చెబుతున్నారు...

Lifestyle: మీక్కూడా తినగానే ఈ అలవాటు ఉందా.? దంతాలు డేంజర్‌లో పడ్డట్లే..
Lifestyle
Follow us on

మనలో చాలా మందికి అన్నం తినగానే టూత్‌ పిక్‌ వాడే అలవాటు ఉంటుంది. మరీ ముఖ్యంగా నాన్‌ వెజ్‌ తీసుకున్న పళ్ల మధ్య ఇరుక్కున్న ఆహారాన్ని తొలగించడానికి వీటిని ఉపయోగిస్తుంటారు. అయితే మొదట్లో ఏదో అవసరానికి ఉపయోగించిన ఈ టూత్‌ పిక్స్‌ కాల క్రమేణా ఓ అలవాటుగా మారిపోతుంది. అసవరం ఉన్నా లేకున్నా టూత్‌ పిక్స్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల దంతాలకు జరిగే మేలు కంటే కీడే ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ టూత్‌ పిక్స్‌ను అధికంగా వాడడం దంతాలకు కలిగే దుష్ప్రభావాలు ఏంటో తెలుసుకుందాం..

* అధికంగా టూత్‌ పిక్స్‌ను ఉపయోగించడం వల్ల పళ్ల మధ్య దూరం పెరుగుతుంది. కాలక్రమంగా ఈ గ్యాప్‌ ఎక్కువై చూడ్డానికి అందవిహీనంగా కనిపిస్తుంది. అలాగే ఓ ఆహార వస్తువు తిన్నా పళ్ల మధ్య ఇరుక్కుపోతోంది. దీంతో ఇది కావిటీస్‌కు కారణమవుతుంది. పళ్లు కుళ్లిపోతాయి.

* టూత్‌ పిక్స్‌ను అదే పనిగా ఉపయోగించడం వల్ల ఎనామిల్ పొర తీవ్రంగా దెబ్బతింటుంది. దీంతో దంతాలు క్రమంగా బలహీనడపతాయి. త్వరగానే ఊడిపోతాయి.

* టూత్‌పిక్స్‌ని ఎక్కువగా ఉపయోగిస్తే.. చిగుళ్లకు గాయాలవుతాయి. దీని కారణంగా రక్తస్రావం ప్రారంభమవుతుంది. ఎక్కువ టూత్‌పిక్‌లను ఉపయోగించడం వల్ల చిగుళ్లలో రక్తస్రావం అవుతుంది. దీంతో భవిష్యత్తులో పళ్లు ఊడిపోయే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

* టూత్‌ పిక్స్‌ అవసరానికి మించి ఉపయోగించడం వల్ల దంతాల మూలాలు బలహీనంగా మారుతాయి. దీంతో పళ్లు బలహీనంగా మారి ఊడిపోతాయి. కాబట్టి వీలైనంత వరకు టూత్‌ పిక్స్‌ ఉపయోగాన్ని తగ్గించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..