ప్రెగ్నెన్సీతో ఉన్న ఆడవాళ్లు నైట్ షిఫ్ట్స్ చేయకూడదు.. ఎందుకంటే.!

|

Mar 27, 2019 | 5:36 PM

ఒక వారంలో రెండు లేదా మూడు నైట్ షిఫ్ట్స్‌లలో ప్రెగ్నెంట్ ఉమెన్ పని చేస్తే.. వారికి చాలా ప్రమాదమని పరిశోధకులు చెబుతున్నారు. ఒకవేళ ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ నైట్ షిఫ్ట్స్‌లో పని చేస్తే వారికి గర్భస్రావం జరిగే ప్రమాదం ఉందట. కోపెన్‌హాగన్, ఆర్హుస్ యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు డెన్మార్క్ లోని ఒక హాస్పిటల్ లో 22,744 మంది గర్భిణీ స్త్రీల సమాచారాన్ని సేకరించారు. ఇక అక్కడ నుంచి వారు సేకరించిన సమాచారాన్ని డానిష్ రిజిస్టర్స్ ద్వారా ఎంతమందికి […]

ప్రెగ్నెన్సీతో ఉన్న ఆడవాళ్లు నైట్ షిఫ్ట్స్ చేయకూడదు.. ఎందుకంటే.!
Follow us on

ఒక వారంలో రెండు లేదా మూడు నైట్ షిఫ్ట్స్‌లలో ప్రెగ్నెంట్ ఉమెన్ పని చేస్తే.. వారికి చాలా ప్రమాదమని పరిశోధకులు చెబుతున్నారు. ఒకవేళ ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ నైట్ షిఫ్ట్స్‌లో పని చేస్తే వారికి గర్భస్రావం జరిగే ప్రమాదం ఉందట.

కోపెన్‌హాగన్, ఆర్హుస్ యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు డెన్మార్క్ లోని ఒక హాస్పిటల్ లో 22,744 మంది గర్భిణీ స్త్రీల సమాచారాన్ని సేకరించారు. ఇక అక్కడ నుంచి వారు సేకరించిన సమాచారాన్ని డానిష్ రిజిస్టర్స్ ద్వారా ఎంతమందికి గర్భస్రావం జరిగింది..? ఎన్ని వారాల్లో ఇది జరిగింది..? అనేది తెలుసుకున్నారు. గర్భం దాల్చిన ఎనిమిదో వారం నుంచే ఈ ప్రమాదం పెరిగినట్టు గుర్తించారు. రెండు లేదా మూడు నైట్ షిఫ్ట్స్ చేసిన మహిళల రిపోర్ట్స్ చూస్తే… నైట్ షిఫ్ట్స్‌లో పని చెయ్యని వారికన్నా, వీరిలో 32 శాతం మందికి గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తెలిసింది.

నైట్ షిఫ్ట్స్ చేసే కొద్దీ ఆ రిస్క్ కూడా పెరుగుతూ ఉంటుందని తేల్చారు. అసలు నైట్ షిఫ్ట్ చేయడం వల్ల గర్భస్రావం ఏంటని అనుకుంటున్నారా..? గర్భధారణ సమయంలో మహిళలు ఎక్కువగా పని చేయడం వల్ల చాలా ప్రమాదం ఉంటుంది.. ముఖ్యంగా నైట్ షిఫ్ట్స్ అయితే వారిలో అలసత్వం ఉంటుంది. దీంతో అసాధారణమైన క్రోమోజోమ్లు వృద్ధి చెంది.. లోపల ఉన్న పిండం బలహీనమవుతుంది. ఇది తీవ్ర గర్భస్రావానికి దారి తీస్తుంది. గర్భంతో ఉన్న మహిళలు చీకటిలో కన్నా వెలుతురులో ఉండటమే మంచిదని పరిశోధకులు అంటున్నారు.