Navaratri 2022: అప్పులతో ఇబ్బందులు పడుతున్నారా.. నవరాత్రుల్లో లక్ష్మీదేవిని ఇలా పూజించండి.. అనుగ్రహం మీ సొంతం

|

Oct 01, 2022 | 7:43 PM

నవరాత్రులలో కొన్నినియమాలను పాటిస్తూ.. అమ్మవారిని పూజిస్తే.. అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చని.. కోరిన కోర్కెలు నెరవేరతాయని నమ్మకం. ఈరోజు మనం దసరా నవరాత్రుల్లో మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కోసం తీసుకోవాల్సిన..

Navaratri 2022: అప్పులతో ఇబ్బందులు పడుతున్నారా.. నవరాత్రుల్లో లక్ష్మీదేవిని ఇలా పూజించండి.. అనుగ్రహం మీ సొంతం
Navaratri Lakshmi Puja
Follow us on

నవరాత్రులను శక్తి పండుగ అని కూడా అంటారు. నవరాత్రులు తొమ్మిది రోజుల్లో దుర్గాదేవి తొమ్మిది రూపాలను పూజిస్తారు. దుర్గామాత అనుగ్రహం కోరుతూ ఉపవాసం ఉంటారు. వ్రతాన్ని ఆచరించడం వల్ల దుర్గ దేవి అనుగ్రహిస్తుందని భక్తుల నమ్మకం. నవరాత్రుల్లో  ప్రధానంగా మహాలక్ష్మి,  మహాకాళి , జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతి దేవిని పూజిస్తారు. నవరాత్రులలో కొన్నినియమాలను పాటిస్తూ.. అమ్మవారిని పూజిస్తే.. అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చని.. కోరిన కోర్కెలు నెరవేరతాయని నమ్మకం. ఈరోజు మనం దసరా నవరాత్రుల్లో మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కోసం తీసుకోవాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం..

అమ్మవారికి డ్రై ఫ్రూట్స్ నైవేద్యం:
శరన్నవరాత్రు 9 రోజుల్లో  ఐదు రకాల డ్రై ఫ్రూట్స్ ను దుర్గదేవికి నైవేద్యంగా సమర్పించండి. అనంతరం ఈ ప్రసాదాన్ని మీరే తినండి. ఇలా చేయడం వలన చాలా కాలంగా ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతాయని నమ్మకం.

ఆర్ధిక స్థితి మెరుగుపడడానికి:
నవరాత్రుల్లో.. వెండి స్వస్తిక, ఏనుగు, దీపం, కలశం, శ్రీయంత్రం, కిరీటం మొదలైన వాటిని కొనుగోలు చేయవచ్చు. తర్వాత అమ్మవారి పాదాల చెంత ఉంచండి. నవరాత్రుల చివరి రోజు అయిన వీటిని గులాబీ రంగు వస్త్రంలో కట్టి.. వాటిని ఒక ఖజానాలో లేదా డబ్బు ఉంచే ప్రదేశంలో భద్రపరచండి. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక స్థితి బలపడుతుందని విశ్వాసం.

ఇవి కూడా చదవండి

రుణబాధలు తీరడానికి తమలపాకు:
ఋణ బాధలు తొలగాలంటే మంగళవారం రోజున తమలపాకుపై లవంగాలు, యాలకులు వేసి పాన్ లా తయారు చేయండి. తర్వాత  హనుమంతుడికి సమర్పించండి. దీంతో త్వరలో అప్పుల నుంచి విముక్తి కలుగుతుంది. అంతే కాకుండా నవరాత్రులలో తమలపాకులో శ్రీరామ నామాన్ని సింధూరంతో రాయండి. అప్పుడు ఈ ఆకును హనుమంతుడికి సమర్పించండి. అయితే తమలపాకును నైవేద్యంగా సమర్పించేటప్పుడు హనుమంతుని పాదాలను తాకకూడదు. ఇలా చేయడం వలన జీవితంలో సుఖసంపదలు లభిస్తాయని నమ్మకం.

నెయ్యితో దీపం:
నవరాత్రులలో, నెయ్యి దీపంలో 4 లవంగాలు వేసి, ఉదయం, సాయంత్రం అమ్మవారి ముందు దీపం వెలిగించాలి. ఇది కుటుంబంపై ఉన్న చెడు దృష్టిని తొలగిస్తుందని విశ్వాసం

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)