ఫుల్లుగా విటమిన్లు, ఖనిజాలు.. 10 రోజులకు ఒక్కసారైనా దీన్ని తినండి..

Updated on: Oct 20, 2026 | 1:14 PM

మాంసాహారుల ఆహారంలో మేక ప్రేగులు (బోటి) ఒక ముఖ్యమైన భాగం. ఇందులో ఐరన్, మెగ్నీషియం, విటమిన్ ఏ, డి, ఈ, బి12 వంటి ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. బోటి రోగనిరోధక శక్తిని పెంచి, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు, కళ్ళకు తోడ్పడుతుంది. కండరాల నిర్మాణానికి అవసరమైన నాణ్యమైన ప్రొటీన్‌ను అందిస్తుంది.

1 / 5
సాధారణంగా మాంసాహారం ప్రియులు చికెన్, మటన్‌ను తరచుగా తీసుకుంటూ ఉంటారు. అయితే, మాంసాహారంలో కొన్ని ముఖ్యమైన భాగాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత కాలంలో కొవ్వు లేని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి మంచివని వైద్యులు చెబుతున్నారు. కొవ్వు అధికంగా ఉన్న ఆహారాలు గుండె జబ్బులతో సహా వివిధ రకాల వ్యాధులకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

2 / 5
మటన్ విషయానికి వస్తే, మేక ప్రేగులలో (బోటి) శరీరానికి అవసరమైన అనేక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఐరన్, మెగ్నీషియం, జింక్, క్రొవ్వులో కరిగే విటమిన్లు ఏ, డి, ఈ పుష్కలంగా ఉన్నాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ ఖనిజాలు, విటమిన్లు శరీరానికి అవసరమైన ప్రయోజనాలను అందిస్తాయి.

3 / 5
బోటిలోని విటమిన్ బి12 ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు, కళ్ళు, కాలేయాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, ఇది రోగనిరోధక వ్యవస్థ పనితీరును గణనీయంగా పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మేక ప్రేగులు జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో తోడ్పడతాయి. ఇందులో ఉండే జెలటిన్, ప్రొబయోటిక్స్ జీర్ణ సమస్యలను నివారించడంలో సహాయపడతాయని చెబుతారు.

4 / 5
ముఖ్యంగా, మేక ప్రేగులను తీసుకోవడం వల్ల పెప్టిక్ అల్సర్ నయమవుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. బోటిలో నాణ్యమైన ప్రొటీన్ అధికంగా ఉంటుంది. ఇది కండరాల పెరుగుదలకు, వాటిని దృఢంగా ఉంచడానికి అత్యవసరం. అలాగే, మేక ప్రేగులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తప్రసరణ సజావుగా సాగి, శరీరంలోని చిన్న చిన్న వ్యాధులన్నీ తొలగిపోయి, శరీరం సక్రమంగా పనిచేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

5 / 5
బోటీని ఫ్రై, కర్రీగా చేసుకుని తినొచ్చు.. అయితే.. మటన్ బోటీ మంచిదే అయినప్పటకీ.. శుభ్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా.. ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా.. సందేహాలున్నా.. ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది..

Loading...
Unable to load recommendations.
Follow Us