Lifestyle: వాకింగ్‌ ఏ సమయంలో చేయాలి.? ఎప్పుడు చేస్తే లాభం..

|

Apr 01, 2024 | 8:48 PM

చక్కెర స్థాయిలు అదుపులో ఉండాలంటే వాకింగ్‌ను అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే ఉదయం 5.30 గంటలకు వాకింగ్ చేయడం మంచిదనేది నిపుణుల అభిప్రాయం. ఉదయం 6 గంటలలోపు వాకింగ్ చేయడం వల్ల ఊపిరితిత్తులకు కూడా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయం స్వచ్ఛమైన గాలి ఉండడమే దీనికి కారణంగా...

Lifestyle: వాకింగ్‌ ఏ సమయంలో చేయాలి.? ఎప్పుడు చేస్తే లాభం..
Walking
Follow us on

ఎన్నో రకాల వ్యాధులకు వాకింగ్‌తో చెక్‌ పెట్టొచ్చని నిపుణులు చెబుతుంటారు. హృద్రోగ్రాలు మొదలు, డయాబెటిస్‌ వరకు అన్ని సమస్యలకు వాకింగ్‌ పరిష్కారం. అయితే సాయంత్రం నడకతో పోల్చితే ఉదయం నడక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ వాకింగ్ చేయడానికి సరైన సమయం ఏంటి.? ఉదయం వాకింగ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

చక్కెర స్థాయిలు అదుపులో ఉండాలంటే వాకింగ్‌ను అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే ఉదయం 5.30 గంటలకు వాకింగ్ చేయడం మంచిదనేది నిపుణుల అభిప్రాయం. ఉదయం 6 గంటలలోపు వాకింగ్ చేయడం వల్ల ఊపిరితిత్తులకు కూడా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయం స్వచ్ఛమైన గాలి ఉండడమే దీనికి కారణంగా చెబుతున్నారు. అలాగే ఉదయం వచ్చే లేలేత సూర్య కిరణాలు పడడం వల్ల విటమిన్‌ డీ లభిస్తుంది. దీంతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు.

అయితే చాలా మంది వృత్తిరీత్యా లేదా బద్ధకంతో ఉదయం నిద్రలేవరు. దీంతో సాయంత్రం వాకింగ్ చేస్తుంటారు. అయితే సాయంత్రంతో పోల్చితే ఉదయం వాకింగ్ చేయడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం నిద్రలేవడం వల్ల డోపమైన్‌ బ్యాలెన్సింగ్ అవుతుందని చెబుతున్నారు. ఉదయం సూర్యకాంతిలో గడిపితే హార్మోన్లు స్థిరంగా ఉంటాయి. ఉదయం నిద్రలేస్తే డోపమైన్ హార్మోన్‌ భారీగా విడుదలవుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. డోపమైన్‌ మానసిక ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రోజంగా ఉషారుగా ఉండేందుకు సహాయపడుతుంది.

ఉదయం వాకింగ్ చేయడం మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతాయని ఇప్పటికే పలు అధ్యయనాల్లో వెల్లడైంది. దీనికి ప్రధాన కారణంగా డోపైమన్‌గా చెబుతున్నారు. అలాగే ఉదయం వాకింగ్ చేయడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నిత్యం నడిచే వారికి గుండె జబ్బుల రిస్క్ చాలా వరకు తగ్గుతుంది. ఎందుకంటే నడకతో శరీరంలో రక్తప్రసరణ పెరిగి చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఫలితంగా రక్తపోటును అదుపులోకి వస్తుంది. దీర్ఘకాలంలో గుండె జబ్బుల రిస్క్ తగ్గుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..