Money Saving Tips: ఈ 5 అలవాట్లు మీ జేబును ఖాళీ చేస్తాయి.. ఇప్పుడే ఈ అలవాట్లను మార్చుకోండి..

|

Sep 16, 2022 | 7:30 AM

Money Saving Tips: ఎంత జీతం వచ్చినా సరిపోవడం లేదా? నెలాఖరు వచ్చేవరకు పర్సు ఖాళీ అయిందా? డబ్బులు ఎలా ఖర్చు చేస్తున్నారో తెలియదా?

Money Saving Tips: ఈ 5 అలవాట్లు మీ జేబును ఖాళీ చేస్తాయి.. ఇప్పుడే ఈ అలవాట్లను మార్చుకోండి..
Wallet
Follow us on

Money Saving Tips: ఎంత జీతం వచ్చినా సరిపోవడం లేదా? నెలాఖరు వచ్చేవరకు పర్సు ఖాళీ అయిందా? డబ్బులు ఎలా ఖర్చు చేస్తున్నారో తెలియదా? ఈ బాధను చాలామంది ఫేస్ చేస్తుంటారు. నెల నెలా ఖర్చులు పెంచుకుంటూ పోతుంటారు. ఈ క్రమంలో పొదుపుపై శ్రద్ధ చూపరు. జేబులో డబ్బులు నిలవకపోవడానికి కొన్ని అలవాట్లు ఉన్నాయి. ఆ అలవాట్ల కారణంగానే ఎంత జీతం వచ్చినా ఇట్టే పర్సు ఖాళీ అవుతుంటుంది. మరి డబ్బులు ఆదా చేసుకోవాలనుకుంటే.. ఆ అలవాట్లను మానుకోవాలి. ఇంతకీ డబ్బును ఖర్చు పెట్టించే ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎక్కువ నగదు తీసుకెళ్లవద్దు: బయటకు వెళ్లినప్పుడు ఎక్కువ నగదు తీసుకెళ్లొద్దు. లేదంటే ఖర్చు పెరుగుతుంది. అదే డబ్బును భద్రంగా దాచుకుంటే.. దానిని ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు.

అధిక ఖర్చు వద్దు: ‘కాళ్లను మంచం ఉన్నంత వరకే చాచాలి’ అంటారు పెద్దలు. ఇది నానుడి జీతం విషయంలో సరిగ్గా సరిపోలుతుంది. మీ జీతాన్ని బట్టి ఖర్చులు పెట్టాల్సిన అవసరం ఉంది. నెలాఖరుకు వచ్చేసరికి రూపాయి కూడా లేకుండా ఖర్చు చేయొద్దు. సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు చేస్తే సమస్యలు వస్తాయి. అందుకే ప్రతీ నెలా కొంత పొదుపు చేయాలి.

షాపింగ్ అలవాటు మానుకోవాలి: కొందరికి ప్రతి నెలా షాపింగ్ చేసే అలవాటు ఉంటుంది. ఈ అలవాటును తగ్గించుకుంటే మంచిది. షాపింగ్ అంశాన్ని కొన్ని నెలలు వాయిదా వేయాలి. అవసరమైన వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలి.

ప్రదర్శన మానుకోవాలి: కొంతమంది గొప్పలకు పోయి తమ వద్ద ఇది ఉంది, అది ఉంది అంటూ ప్రదర్శించుకుంటుంటారు. అంత అవసరం లేదు. ఎవరి జీవితం వారికోసమే.. వేరొకరికోసం జీవించాల్సిన అవసరం లేదు. ఇతరుల ముందు గొప్పల కోసం ఏది పడితే అది కొంటే.. ఆ తరువాత భవిష్యత్‌లో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

పార్టీలు వద్దు: కొందరు పార్టీల పేరుతో డబ్బును వృధాగా ఖర్చు చేస్తారు. స్నేహితులను ఆహ్వానించడం, పార్టీలు చేస్తూ హడావుడి చేస్తారు. దీనివల్ల డబ్బు వృధాగా ఖర్చు అవుతుంది. ఎప్పుడో ఒకసారి పార్టీ చేసుకుంటే పర్వాలేదు. కానీ, ప్రతీసారి పార్టీల పేరుతో డబ్బు ఖర్చు చేసుకుంటే.. చివరకు చిప్పే గతి అవుతుంది. అందుకే.. ఈ విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..