కొత్తగా యోగా మొదలుపెడుతున్నారా? ఇంట్లోనే ఈజీగా చేసేందుకు మలైకా వర్కౌట్స్

Malaika Arora Yoga: యోగా కొత్తగా ప్రారంభించాలనుకునేవారికి బాలీవుడ్ నటి మలైకా అరోరా ఒక సింపుల్ ఆసనాన్ని పరిచయం చేశారు. శ్వాసకు అనుగుణంగా చేసే విన్యాస ఫ్లో యోగా క్రమంలో అధోముఖ శ్వానాసనం, వీరభద్రాసనం వంటి భంగిమలు ఉన్నాయి. ఈ సాధన శరీరంలో ఫ్లెక్సిబిలిటీ, బ్యాలెన్స్, బలాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతాయని మలైకా సూచించారు. ప్రత్యేక పరికరాలు అవసరం లేకుండా ఇంట్లోనే సులభంగా చేయగల ఈ యోగా రొటీన్ కొత్తగా యోగా ప్రారంభించేవారికి ఉపయోగపడుతుంది.

కొత్తగా యోగా మొదలుపెడుతున్నారా? ఇంట్లోనే ఈజీగా చేసేందుకు మలైకా వర్కౌట్స్
Representative Image

Updated on: Sep 29, 2026 | 5:16 PM

బాలీవుడ్ నటి, ఫిట్‌నెస్‌ లవర్ మలైకా అరోరా తరచూ తన యోగా, వర్కౌట్ రొటీన్‌కు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా  కొత్తగా యోగా ప్రారంభించేవారికి ఉపయోగపడేలా సింపుల్ యోగాసనం వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వ్యాయామంలో శ్వాసకు అనుగుణంగా వివిధ యోగా భంగిమలను వరుసగా చేశారు.  తమ ఇంట్లోనే ఓ గదిలో ఈ సింపుల్ యోగాసనాలు ప్రాక్టీస్ చేయొచ్చు.

విన్యాస ఫ్లో అనే సింపుల్ యోగాసనాన్ని మలైకా ప్రదర్శించారు. ఇది శారీరక కదలికలను శ్వాసతో సమన్వయం చేస్తూ చేసే యోగా విధానం. మలైకా షేర్ చేసిన రొటీన్‌లో శరీరాన్ని నెమ్మదిగా కదిలిస్తూ వివిధ భంగిమలకు మారడం కనిపిస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది.

తర్వాత ఆమె వీరభద్రాసనం (Warrior Pose) చేస్తున్న వీడియోను షేర్ చేశారు. ఒక కాలును ముందుకు ఉంచి, మరో కాలును వెనుకకు చాపుతూ చేతులను పైకి ఎత్తి భంగిమను కొనసాగించారు. అనంతరం చేతులను భుజాల స్థాయికి తీసుకువచ్చి మోకాలిని స్వల్పంగా వంచారు. ఈ భంగిమలను వేగంగా మార్చుతూ స్ట్రెచింగ్ చేయడం, కాలి దగ్గరికి చేతిని తీసుకెళ్లడం, ఒక చేతిని కాలిపై ఉంచి మరో చేతిని పైకి చాపడం వంటి కదలికలు ఉన్నాయి.

కొత్తగా యోగా మొదలుపెట్టే వారికోసం.. మలైకా అరోరా యోగా భంగిమలు..


మలైకా సూచించిన ఈ బేసిక్ యోగా భంగిమలకు ప్రత్యేక పరికరాలు అవసరం లేదు. యోగా కొత్తగా ప్రారంభించేవారు తొందరపడకుండా, తమ శరీర సామర్థ్యానికి అనుగుణంగా నెమ్మదిగా వీటిని సాధన చేయడం మంచిది. శ్వాసపై దృష్టి పెట్టడం కూడా ముఖ్యమే.

(గమనిక: యోగా లేదా ఏదైనా వ్యాయామాన్ని ప్రారంభించే ముందు మీ శారీరక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోండి. నొప్పి, శ్వాస ఇబ్బంది లేదా ఇతర అసౌకర్యం కలిగితే సాధనను ఆపి నిపుణుల సలహా తీసుకోవాలి)

Loading...
Unable to load recommendations.
Follow Us