
ప్రస్తుత రోజుల్లో, మోకాళ్ళ నొప్పులు కేవలం వృద్ధులకే కాకుండా 30-40 ఏళ్ల వారికీ సాధారణమయ్యాయి. అయితే ఈ సమస్యకు ఆపరేషన్ అవసరం లేకుండా సహజసిద్ధమైన పద్ధతులు, ఆధునిక చికిత్సల ద్వారా చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో జరిగిన పరిశోధనల ప్రకారం, లో ఇంటెన్సిటీ పల్స్డ్ అల్ట్రాసౌండ్ (LIPUS) చికిత్స మోకాళ్ళ నొప్పులు తీవ్రం కాకుండా నివారిస్తుందని, ముఖ్యంగా గ్రేడ్ 1, 2 దశల్లో ఉన్నప్పుడు వాపు, నొప్పిని గణనీయంగా తగ్గిస్తుందని రుజువైంది. అలాగే కొన్ని సహజ పద్దతుల ద్వారా కూడా సమస్యను తగ్గించుకోవచ్చు.
సహాజ పద్దతిలో మోకాళ్ల నొప్పులు తగ్గించుకోవడం ఎలా?
బరువు నియంత్రణ: మోకాళ్ళపై భారాన్ని తగ్గించడానికి అధిక బరువును తగ్గించడం చాలా ముఖ్యం.
వ్యాయామం: కీళ్ళకు సరైన జిగురు ఉత్పత్తి అయ్యేలా క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామాలు చేయడం అవసరం.
విశ్రాంతి: నొప్పి, వాపు వచ్చినప్పుడు తగిన విశ్రాంతి తీసుకోవడం వల్ల M2 కణాలు దెబ్బతిన్న కణజాలాన్ని మరమ్మత్తు చేయడానికి అవకాశం లభిస్తుంది.
ఇంటి చిట్కాలు: నువ్వుల నూనెలో కర్పూరం కలిపి నొప్పి ఉన్నచోట రాసి, కాపడం పెట్టుకోవడం వల్ల చాలామందికి ఉపశమనం లభిస్తుంది. అలాగే మునగ గింజల పెయిన్ రిలీఫ్ ఆయిల్ను ఉపయోగించడం ద్వారా కూడా అనేకమంది సానుకూల ఫలితాలను పొందారు.
మోకాళ్ళ నొప్పుల ఆపరేషన్లకు వెళ్లకుండా ఉండాలంటే, గ్రేడ్ 1 లేదా గ్రేడ్ 2 దశల్లో ఉన్నప్పుడే ఈ LIPUS చికిత్సను సహజ పద్ధతులను అనుసరించడం తో పాటు. ఫిజియోథెరపీ సెంటర్లలో లో ఇంటెన్సిటీ పల్స్డ్ అల్ట్రాసౌండ్ చికిత్స గురించి అడిగి తెలుసుకోవడం ద్వారా మోకాళ్ళ నొప్పుల నుండి శాశ్వత ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే కీళ్లలో జిగురు ఉత్పత్తి చేసే వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయాలి.
మరిన్ని లైఫ్స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.