Heart Attack: మహిళలకు, పురుషులకు గుండెపోటు లక్షణాలు వేరుగా ఉంటాయా.?

|

Sep 07, 2024 | 4:59 PM

ఇదిలా ఉంటే గుండెపోటును ముందుగా గుర్తించడం వల్ల మరణాలను తగ్గించవచ్చని నిపుణులు చెబుతుంటారు. కొన్ని ముందస్తు లక్షణాల ద్వారా గుండెపోటును ముందుగానే గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆ లక్షణాలు మహిళలకు, పురుషులకు వేరువేరుగా ఉంటాయని ఆలోచనలో చాలా మందిలో ఉంటుంది. ఇంతకీ ఇది కేవలం అపోహ మాత్రమేనా.?

Heart Attack: మహిళలకు, పురుషులకు గుండెపోటు లక్షణాలు వేరుగా ఉంటాయా.?
Heart Attack
Follow us on

గుండె పోటు.. ఇప్పుడీ పదం సర్వసాధారణంగా మారిపోయింది. పట్టుమని పాతికేళ్లు కూడా నిండని వారు గుండెపోటుతో మరణిస్తున్నారు. మరీ ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత గుండెపోటు మరణాలు భారీగా పెరుగుతున్నాయి. అప్పటి వరకు ఎంతో ఉల్లాసంగా ఉన్న వారు కూడా ఒక్కసారిగా కుప్పుకూలి పోతున్నారు. మారిన జీవన విధానం, శారీరక శ్రమ తగ్గడం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా గుండె పోటు బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది.

ఇదిలా ఉంటే గుండెపోటును ముందుగా గుర్తించడం వల్ల మరణాలను తగ్గించవచ్చని నిపుణులు చెబుతుంటారు. కొన్ని ముందస్తు లక్షణాల ద్వారా గుండెపోటును ముందుగానే గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆ లక్షణాలు మహిళలకు, పురుషులకు వేరువేరుగా ఉంటాయని ఆలోచనలో చాలా మందిలో ఉంటుంది. ఇంతకీ ఇది కేవలం అపోహ మాత్రమేనా.? నిజంగానే గుండెపోటు లక్షణాలు.. మహిళల్లో, పురుషుల్లో వేరువేరుగా ఉంటాయా.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మహిళల్లో గుండెపోటు రావడానికి అధిక బరువు, ఊబకాయం ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. ఎన్నో పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి కూడా. కేవలం మహిళలకు మాత్రమే పరిమితం కాకుండా పురుషుల్లో కూడా గుండెపోటుకు ఇవే కారణాలుగా చెబుతున్నారు. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం వంటివి గుండె సమస్యలకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు.

అయితే గుండె పోటు లక్షణాల విషయానికొస్తే.. గుండెపోటు వచ్చే ముందు స్త్రీలకు భుజం నొప్పి వస్తుందనే నమ్మకం ఎక్కువ మందిలో ఉంది. అయితే గుండెపోటు వచ్చే ముందు మహిళలతో పాటు, పురుషుల్లోనూ ఛాతీలో నొప్పి, అసౌకర్యంగా ఉంటుంది. అలాగే భుజాలు, చేతులు, వీపు, మెడ, దవడ వంటి భాగాల్లో కూడా నొప్పిగా ఉంటుంది. అయితే మహిళల్లో గుండెపోటు లక్షణాలు ఛాతికి బదులుగా భుజాల్లోనే ఉంటుందని నమ్ముతారు. భుజం నొప్పి మహిళల్లో గుండెపోటు లక్షణమని చెప్పడంలో ఎలాంటి నిజం లేదని నిపుణులు చెబుతున్నారు.

పురుషులతో పోల్చితే మహిళల్లో గుండెపోటు లక్షణాలు తేడాగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటి ప్రకారం ఎలాంటి పనిచేయకపోయినా విపరీతంగా చెమటలు రావడం. తలనొప్పి లేదా వికారం ఉండడం. ఛాతీ నొప్పితో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడం. చిన్నిచిన్న పనులకే అలసిపోవడం లాంటి లక్షణాలు గుండెపోటు వచ్చే ముందు మహిళల్లో ఎక్కువగా కనిపిస్తాయని అంటున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..