పుచ్చకాయ త్వరగా పాడవుతుందా?.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే వారమైనా ఫ్రెష్‌గా ఉంచుకోవచ్చు!

Watermelon Storage Tips: వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకునేందుకు చాలా మంది పుచ్చకాయను తినేందుకు ఇష్టపడుతారు. అయితే ఇక్కడ చాలా మంది ఫేస్ చేసే సమస్య ఏమిటంటే పుచ్చకాయను తాజాగా ఉంచుకోవడం. కొన్న ఒక రోజుకే కొన్ని సార్లు పుచ్చకాయ చెడిపోతుంది. కాబట్టి పుచ్చకాయను ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఎలా ఉంచుకోవాలో చూద్దాం.

పుచ్చకాయ త్వరగా పాడవుతుందా?.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే వారమైనా ఫ్రెష్‌గా ఉంచుకోవచ్చు!
Watermelon Storage Tips

Updated on: May 02, 2026 | 6:26 PM

సమ్మర్ వచ్చిందంటే చాలూ ప్రతి ఒక్కరూ పుచ్చకాయ, మామిడి పండ్లను తినేందుకు ఇష్టపడుతారు. ముఖ్యంగా ఈ ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది పుచ్చకాయనే ఎంచుకుంటారు. అయితే ఇది పెద్ద పరిమాణంలో ఉంటుంది కాబట్టి.. కొన్న మొత్తం పుచ్చకాయను ఒక్కసారే తినలేరు. ఒక రోజు తర్వాత తిందాం అంటే అదిపాడైపోతుంది. లేదా దాని నుంచి దర్వాసన వస్తుంది. కాబట్టి సమ్మర్‌లో పుచ్చకాయను ఎక్కువ రోజులు ఎలా ఫ్రెష్‌గా ఉంచుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి పుచ్చకాయ ఫ్రెష్‌గా ఉండాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో చూద్దాం.

పుచ్చకాయను తాజాగా ఎలా ఉంచుకోవాలి?

సరైన పద్దతిలో నిల్వ చేయండి: పుచ్చకాయను తాజాగా ఉంచడానికి చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేయడం చాలా ముఖ్యం. సాధారణ గది ఉష్ణోగ్రత వీటిని త్వరగా పాడు చేస్తుంది, కాబట్టి వీటిని ఫ్రిజ్‌లో లేదా ఏదైనా చల్లని ప్రదేశంలో ఉంచడం ఉత్తమం. అలాగే, వీటిపై నేరుగా సూర్యరశ్మి పడకుండా చూసుకోవాలి, ఎందుకంటే ఎండ వల్ల పుచ్చకాయ త్వరగా పాడయ్యే అవకాశం ఉంది.

తేమను కాపాడుకోవడం: పుచ్చకాయలను తాజాగా ఉంచడానికి మరొక మార్గం, మీరు కట్‌ చేసిన పుచ్చకాయ త్వరగా పాడవకూడదంటే దానిని ప్లాస్టిక్ కవర్‌తో గట్టిగా చుట్టి ఉంచండి. ఇలా చేయడం వల్ల అది త్వరగా ఎండిపోకుండా, తన తేమను కోల్పోకుండా ఉంటుంది. ఒకవేళ మీరు పుచ్చకాయను వెంటనే తినకూడదు అనుకుంటే, ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి దానిని ఫ్రీజర్‌లో కూడా భద్రపరచవచ్చు.

శుభ్రత, తినే ముందు జాగ్రత్తలు: పుచ్చకాయను తినడానికి సిద్ధం చేసినప్పుడు, మొదట దానిని శుభ్రంగా కడగాలి. పుచ్చకాయల పైన బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉన్నందున, కోసే ముందు వాటిని శుభ్రం చేయడం చాలా ముఖ్యం. అలాగే, కొంతమందికి పుచ్చకాయ గింజలు కడుపునొప్పిని కలిగించవచ్చు, కాబట్టి తినే ముందు వాటిని తొలగించడం మంచిది. పైన చెప్పిన చిట్కాలను పాటించడం ద్వారా మీరు పుచ్చకాయను ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంచుకోవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us