కాఫీ కప్ చూడగానే ఎలాంటి కిక్ వస్తుంది..?

| Edited By: Pardhasaradhi Peri

Apr 05, 2019 | 5:48 PM

ప్రపంచ వ్యాప్తంగా కొన్ని మిలియన్ల మంది జీవితాలు ఒక కాఫీ కప్పుతోనే మొదలవుతుంది. పొద్దున్నే లేవగానే కాఫీనో, టీనో తాగడం దైనందిన అలవాటుగా మారిపోయింది. కాఫీలో ఉండే కెఫీన్ నిద్రమత్తును వదిల్చి పనులను చకచకా చేయడానికి అనుగుణంగా శరీరాన్ని తయారు చేస్తుందని అనుకుంటుంటారు. కాగా.. కాఫీ, టీపై శాస్త్రవేత్తలు చేసిన తాజా పరిశోధనలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మెదడును అప్రమత్తం చేయడంలో కాఫీ కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. అలాగే మనుషులను ఉత్తేజపరచడంలో కూడా కాఫీ ప్రధాన పాత్రను పోషిస్తుందట. […]

కాఫీ కప్ చూడగానే ఎలాంటి కిక్ వస్తుంది..?
Follow us on

ప్రపంచ వ్యాప్తంగా కొన్ని మిలియన్ల మంది జీవితాలు ఒక కాఫీ కప్పుతోనే మొదలవుతుంది. పొద్దున్నే లేవగానే కాఫీనో, టీనో తాగడం దైనందిన అలవాటుగా మారిపోయింది. కాఫీలో ఉండే కెఫీన్ నిద్రమత్తును వదిల్చి పనులను చకచకా చేయడానికి అనుగుణంగా శరీరాన్ని తయారు చేస్తుందని అనుకుంటుంటారు. కాగా.. కాఫీ, టీపై శాస్త్రవేత్తలు చేసిన తాజా పరిశోధనలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మెదడును అప్రమత్తం చేయడంలో కాఫీ కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. అలాగే మనుషులను ఉత్తేజపరచడంలో కూడా కాఫీ ప్రధాన పాత్రను పోషిస్తుందట.

కాఫీకి సంబంధించి అమెరికా, కెనడా, యూరప్, చైనా, జపాన్ మరియు కొరియా దేశాలకు సంబంధించిన శాస్త్రవేత్తలు ‘కాఫీ, టీ క్యూస్’ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ప్రపంచంలోనే అత్యధికంగా నాల్గవ స్థానంలో కాఫీని తాగుతున్నారని కనుగొన్నారు. అలాగే.. రెండో ప్లేస్‌లో ఎక్కువ మంది టీ తాగుతున్నారని తెలిపారు పరిశోధకులు జర్నల్ అండ్ కాగ్నిషన్. కాఫీ, లేదా టీ యాడ్స్ పై కూడా ప్రజల గుండె ఎలా స్పందిస్తుందో కూడా పరిశోధించారు. టీ కప్పు చూసి స్పందించే వారి కన్నా, కాఫీ కప్పు చూసి ఎక్కువమంది గుండె వేగంగా స్పందించిందని చెప్పారు.

అలాగే.. కాఫీ తాగే వారి ముఖ కవళికలు ఎలా ఉన్నాయి..? టీ తాగేవారి ముఖ కవళికలు ఎలా ఉన్నాయో కనుగొన్నారు. టీ తాగే వారి కన్నా, కాఫీ తాగేవారు ఎక్కువ ప్రభావం చెందారని శాస్త్రవేత్త మిగ్ మాగ్లియో అన్నారు. సాధారణంగా ఒక టీ కప్పులో 40 గ్రాముల తేయాకు ఉంటే.. కాఫీలో 150 గ్రాముల కెఫీన్ ఉంటుందంట. అలాగే.. ఎక్కువగా కాఫీ తాగినా.. టీ తాగినా అవి అనారోగ్యానికి దారి తీస్తాయని, క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదముందని తెలియజేశారు.