ఎముకల్లో గుజ్జును పెంచే సూపర్‌ఫుడ్.. నెలకు ఒక్కసారైనా మస్ట్‌గా తినండి..

Updated on: Oct 24, 2026 | 12:51 PM

మటన్ పాయ అద్భుతమైన ఆహారం.. దీనిలో ఎన్నో పోషకాలు, ఖనిజాలు దాగున్నాయి.. ఈ ఆరోగ్యకరమైన సూప్ కాల్షియం, ప్రోటీన్‌తో నిండి ఉంటుంది. పాయ పలు సమస్యలను దూరం చేసి.. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.. అన్నం, రోటీ, పూరి, ఇడ్లీ, దోశ వంటి వాటితో అద్భుతమైన రుచినిస్తుంది. చిక్కటి గ్రేవీతో కూడిన ఈ పాయ ఎంతో రుచిగా ఉంటుంది.. మటన్ పాయ లాభాలు, తయారీ విధానాన్ని తెలుసుకోండి..

1 / 5
నాన్ వెజ్ ప్రియులకు మటన్ అనగానే నోరూరుతుంది.. మటన్‌ (మేక మాంసం) ఫ్రై, కర్రీతోపాటు పలు రకాలుగా వండుకుని తింటారు. అయితే.. మటన్ లోని చాలా భాగాలు.. తలకాయ, లివర్, కాళ్లు (పాయ), తలకాయం దబ్బ, బోటి.. వేటికవే ప్రత్యేకం.. ఇవి శరీరానికి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.. అయితే.. మేక కాళ్లు (పాయ) మరిన్ని పోషకాలను కలిగి ఉంటాయని డైటీషియన్లు చెబుతున్నారు. పాయ సూప్ ఎముకల బలానికి, శారీరక నొప్పులు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనానికి, పలు అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటున్న వారికి ఆరోగ్యకరమైన వంటకం.. దీనివల్ల శరీరంలో ఎముకల మజ్జ వృద్ధి చెందుతుందని పేర్కొంటున్నారు.

2 / 5
మటన్ పాయలో కొల్లాజెన్, ప్రోటీన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.. ముఖ్యంగా కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియంతోపాటు విటమిన్లతో సమృద్ధిగా ఉంటుందని, అందుకే.. ప్రతి 15 రోజులకు ఒకసారి లేదా.. రెండు సార్లు పాయా తీసుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.. ఇది ఎముకలను బలోపేతం చేయడంతోపాటు.. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే, జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయని డైటీషియన్లు చెబుతున్నారు.

3 / 5
ఇలా మటన్ పాయ అనేది ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకాల్లో ఒకటి. కాల్షియం, ప్రోటీన్, అమినో ఆమ్లాలు, ఆరోగ్యకరమైన బోన్ సూప్‌తో నిండి ఉన్న ఈ పాయ సూప్.. మాంసాహార ప్రియులకు ఇది ఎంతగానో నచ్చుతుంది. రెసిపీలో మేక కాళ్లను ఉపయోగించి పలు రకాలుగా రుచికరమైన సూప్ తయారుచేచేసుకోవచ్చు..

4 / 5
పాయ సూప్ కోసం కావాలసిన ముఖ్యమైన పదార్థాలు: గసగసాలు, ఎండు కొబ్బరి, జీడిపప్పు, దాల్చినచెక్క, యాలకులు, లవంగాలు, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్‌ఫ్లవర్ నూనె, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర... ముందుగా పాయలను శుభ్రం చేసుకున్న తర్వాత, వాటిని ప్రెషర్ కుక్కర్‌లో కనీసం 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించడం ముఖ్యం. బాగా ఉడికిన పాయలు రుచిగా ఉంటాయి. ఒకవేళ 7 విజిల్స్‌కి ఉడకకపోతే, మరో 2-3 విజిల్స్ రానివ్వడం తప్పనిసరి.

5 / 5
పాయ కర్రీ తయారీలో గ్రేవీ చిక్కగా అయ్యే వరకు ఉడికించి, చివరగా స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ రెసిపీని అన్నంలోకి, రోటి, పూరి, ఇడ్లి, దోశ, గారెల్లోకి తీసుకోవచ్చు. అన్నింటితో చాలా రుచిగా ఉంటుంది. అందుకే.. ఎన్నో పోషకాలున్న ఈ రెసిపీని తప్పకుండా ప్రయత్నించి, దీని అద్భుతమైన రుచిని ఆస్వాదించండి...

Loading...
Unable to load recommendations.
Follow Us