Lifestyle: రక్తపోటుతో చర్మానికి కూడా ప్రమాదమే.. నిపుణులు ఏమంటున్నారంటే

|

May 26, 2024 | 1:57 PM

అధిక రక్తపోటు రక్త ప్రవాహాంపై ప్రభావం చూపుతుందని తెలిసిందే. ఈ కారణంగా చర్మానికి పోషకాలు, ఆక్సిజన్‌ అందడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. దీంతో చర్మం పొడిబారడం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భంగాల్లో ఇది ఎరిథీమా, పెటెచియా అనే తీవ్రమైన పరిస్థితులకు కూడా దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు...

Lifestyle: రక్తపోటుతో చర్మానికి కూడా ప్రమాదమే.. నిపుణులు ఏమంటున్నారంటే
High Bp
Follow us on

అధిక రక్తపోటు ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు అధిక రక్తపోటు కారణమవుతుంటుంది. సాధారణంగా అధిక రక్తపోటుతో బాధపడేవారిలో గుండె సంబంధిత సమస్యలు వస్తాయని మనందరికీ తెలిసిదే. గుండె ఆగిపోవడానికి ప్రధాన కారణాల్లో రక్తపోటు ఒకటని చెబుతుంటారు. అయితే అధిక రక్తపోటు చర్మ సమస్యలకు కూడా కారణమవుతుందని మీకు తెలుసా.? అవును వైద్యులు ఇదే విషయాన్ని చెబుతున్నారు.

అధిక రక్తపోటు రక్త ప్రవాహాంపై ప్రభావం చూపుతుందని తెలిసిందే. ఈ కారణంగా చర్మానికి పోషకాలు, ఆక్సిజన్‌ అందడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. దీంతో చర్మం పొడిబారడం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భంగాల్లో ఇది ఎరిథీమా, పెటెచియా అనే తీవ్రమైన పరిస్థితులకు కూడా దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు శరీరంపై అయ్యే గాయాలు నయం కావడానికి కూడా ఆలస్యమవుతాయని చెబుతున్నారు. కారణమవుతుంది. అదనంగా, గాయం నయం చేయడంలో ఆలస్యం కావచ్చని నిపుణులు చెబుతున్నారు.

అధిక రక్తపోటు సిరలలో సంకోచానికి కారణమవుతుంది. ఇది చర్మానికి రక్త ప్రసరణ అందడంలో ఇబ్బందులకు కారణమవుతుంది. దీంతో రోగనిరోధక కణాలు క్షీణించి, చర్మం మరమ్మత్తు చేసే శక్తిని కోల్పోతుంది. ఇక చర్మం ఎరుపు రంగులోకి మారినా అది అధిక రక్తపోటు ప్రాథమిక లక్షణంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా రక్తపోటు నియంత్రనలో లేని వారి ముఖం ఎరుపు రంగులోకి మారడాన్ని గమనించవచ్చు. దీర్ఘకాలంగా అధికరక్తపోటుతో బాధపడే వారిలో చర్మం బలహీనంగా మారుతుంది.

అయితే అధిక రక్తపోటుకు మొటిమలు, సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులకు నేరుగా ఎలాంటి సంబంధం లేకున్న ఇది వ్యాధులను పెంచడానికి కారణమవుతుందని నిపుణులు అంటున్నారు. కేవలం చర్మ సంబంధిత సమస్యలే కాకుండా.. మధుమేహం, మూత్రపిండాల వ్యాధి, గుండె సంబంధిత సమస్యలకు దారి తీస్తుందని చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..