Lemon: నీళ్లలో నిమ్మరసం కలిపి తలస్నానం చేస్తే వందల సమస్యలకు చెక్ పెట్టొచ్చు.. కీలక వివరాలు మీకోసం..

|

Sep 16, 2022 | 7:20 AM

Lemon: రోజూ ఉదయాన్నే తలస్నానం చేయడం పరిశుభ్రతకే కాదు ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యం. కానీ స్నానం చేసే నీటిలో నిమ్మరసం కలుపుకోవడం..

Lemon: నీళ్లలో నిమ్మరసం కలిపి తలస్నానం చేస్తే వందల సమస్యలకు చెక్ పెట్టొచ్చు.. కీలక వివరాలు మీకోసం..
Lemon
Follow us on

Lemon: రోజూ ఉదయాన్నే తలస్నానం చేయడం పరిశుభ్రతకే కాదు ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యం. కానీ స్నానం చేసే నీటిలో నిమ్మరసం కలుపుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవును, నిమ్మకాయలో యాంటీమైక్రోబయల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు, విటమిన్ సి మొదలైనవి ఉన్నాయి. ఇది చర్మానికి సంబంధించిన అనేక సమస్యలను నయం చేస్తుంది. నిమ్మరసంతో స్నానం చేస్తే చర్మానికి సంబంధించిన ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

శరీరంపై ముడతలు: నీటిలో నిమ్మరసం కలిపి స్నానం చేయడం వల్ల శరీరంపై ముడతలు తగ్గుతాయి. సాధారణంగానే వయసు పెరుగుతుంటే.. శరీరంపై చర్మం ముడతలు పడుతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో స్నానం చేసే నీటిలో నిమ్మరసం కలుపుకుని స్నానం చేస్తే ప్రయోజనం ఉంటుంది.

ఆయిల్ స్కిన్: చాలా మంది ఆయిల్ స్కిన్ తో బాధపడుతుంటారు. అయితే, నిమ్మరసం ఈ సమస్యను అధిగమించడంలో సహాయపడుతుంది. అవును, నిమ్మరసంతో స్నానం చేయడం వల్ల ఆయిల్ స్కిన్ సమస్య తొలగిపోతుంది. మీరు జిడ్డు చర్మంతో బాధపడుతున్నట్లయితే.. స్నానం చేసే నీటిలో నిమ్మకాయ పిండి.. ఆ నీటితో స్నానం చేస్తే ప్రయోజనం ఉంటుంది.

శరీరంపై మచ్చలు: శరీరంపై మచ్చలు తొలగిపోవడానికి నియమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ అద్భుతంగా పనిచేస్తుంది. శరీరంపై పేరుకుపోయిన మురికిని తొలగిస్తుంది. నిమ్మకాయలో ఉండే బ్లీచింగ్ లక్షణాలు.. చర్మంపై ఉండే మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది. నిమ్మకాయ రసాన్ని నీటిలో కలుపుకుని రోజూ స్నానం చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..