Money Plant: మనీ ప్లాంట్ అందంగా, గుబురుగా పెరగాలంటే జస్ట్ ఇలా చేయండి చాలు.. ఇల్లంతా అల్లుకుపోవాల్సిందే..

Money Plant Growth Hacks: మనీ ప్లాంట్ ఇళ్లలో పెంచే అత్యంత సాధారణ, సులభమైన ఇండోర్ మొక్క.. ఇది పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో ఉంటే.. సానుకూల శక్తిని, ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుందని నమ్ముతారు. అయితే.. మనీ ప్లాంట్‌ను గుబురుగా, ఆరోగ్యంగా పెంచుకోవడానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలు పాటించాలి.. అవేంటో తెలుసుకుందాం..

Money Plant: మనీ ప్లాంట్ అందంగా, గుబురుగా పెరగాలంటే జస్ట్ ఇలా చేయండి చాలు.. ఇల్లంతా అల్లుకుపోవాల్సిందే..
Money Plant

Updated on: Mar 26, 2026 | 6:00 PM

మనీ ప్లాంట్ ఇళ్లలో పెంచే అత్యంత సాధారణ, సులభమైన ఇండోర్ మొక్క.. ఇది గాలిని శుద్ధి చేయడమే కాకుండా.. పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. వాస్తు ప్రకారం.. మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో సానుకూల శక్తిని, ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుందని నమ్ముతారు. ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే డబ్బుకు లోటు ఉండదని, సుఖ సంతోషాలు కలుగుతాయని చాలామంది వాస్తు శాస్త్రం నిపుణులు పేర్కొంటుంటారు. అయితే.. ఇది మట్టిలో లేదా నీటిలో కూడా సులభంగా పెరుగుతుంది. ఇంట్లో సులువుగా దీనిని పెంచుకోవచ్చు.. వాస్తు ప్రకారం, మనీ ప్లాంట్‌ను ఇంటి ఆగ్నేయ మూలలో (South-East) ఉంచడం అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు. అయితే.. మీ ఇంట్లో మనీ ప్లాంట్‌ను గుబురుగా, పెద్ద ఆకులతో మొక్కను పెంచుకోవడానికి కొన్ని ఆచరణాత్మక చిట్కాలను పాటించడం మంచిది.. నిపుణులు అందించిన ఈ చిట్కాలను అనుసరించడం ద్వారా మీ మనీ ప్లాంట్ కూడా అందరినీ ఆకట్టుకునేలా పెరుగుతుంది.

ముఖ్యంగా మనీ ప్లాంట్ సంరక్షణలో నీటిపారుదల కీలక పాత్ర పోషిస్తుంది. బియ్యం కడిగిన నీరు దీనికి చాలా ఉపయోగపడుతుంది. బియ్యం కడిగిన మొదటి రెండు సార్లు వచ్చిన నీటిని పారబోయకుండా నిల్వ చేసుకొని మనీ ప్లాంట్‌కు పోయండి. ఈ నీటిలో ఉండే పోషకాలు మొక్కల పెరుగుదలకు తోడ్పడతాయి. అదేవిధంగా, కూరగాయల తొక్కలు కూడా అద్భుతమైన సహజ ఎరువుగా పనిచేస్తాయి. కూరగాయల తొక్కలను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఆ నీటిని మనీ ప్లాంట్‌కు పోయండి. ఇది మొక్కలకు అవసరమైన పోషకాలను అందించి, వాటిని ఆరోగ్యంగా ఉంచుతుంది.

మనీ ప్లాంట్ మట్టిలో వానపాములు ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. వానపాములు మట్టిలో రంధ్రాలు చేసి, మొక్కల వేర్లకు గాలి తగిలేలా చేస్తాయి. అంతేకాకుండా, వాటి విసర్జన మొక్కలకు సహజ యూరియాగా పనిచేసి, పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. మట్టిని వారానికోసారి పైపైన కదుపుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మట్టి బిగుసుకుపోకుండా ఉండి, నీరు బాగా ఇంకిపోతుంది. మట్టిలో నీరు నిలిచిపోకుండా చూసుకోవడం ద్వారా వేర్లు కుళ్ళిపోకుండా ఉంటాయి.

మనీ ప్లాంట్ నుంచి ఏవైనా పండిపోయిన లేదా ఎండిపోయిన ఆకులు ఉంటే, వాటిని వెంటనే తొలగించాలి. ఇది మొక్క శక్తిని వృథా చేయకుండా, కొత్త ఆకులు పెరిగేలా ప్రోత్సహిస్తుంది. అదనపు పోషణ కోసం, ఒక స్పూన్ జిప్సం సాల్ట్‌ను మట్టిలో కలపండి. ఇది మనీ ప్లాంట్‌కు మంచి ఫలితాలను ఇస్తుంది.

చివరగా, మీ మనీ ప్లాంట్‌కు ప్రతిరోజు ఉదయం పూట కనీసం ఒక గంట పాటు సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. ఇది మొక్కను మరింత ఆరోగ్యంగా, పచ్చగా పెంచడానికి సహాయపడుతుంది. ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీ మనీ ప్లాంట్ గుబురుగా, అందంగా పెరుగుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us