Green Tea Side Effects: గ్రీన్ టీ అధికంగా తాగుతున్నారా? అయితే, ఈ విషయం తెలుసుకోవాల్సిందే..

|

Jul 07, 2022 | 6:20 AM

Green Tea Side Effects: గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిందని అందరూ చెప్తుంటారు. అనేక నివేదికలు, ఆరోగ్య నిపుణులు, వైద్యులు సైతం ఇదే చెబుతుంటారు.

Green Tea Side Effects: గ్రీన్ టీ అధికంగా తాగుతున్నారా? అయితే, ఈ విషయం తెలుసుకోవాల్సిందే..
Green Tea
Follow us on

Green Tea Side Effects: గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిందని అందరూ చెప్తుంటారు. అనేక నివేదికలు, ఆరోగ్య నిపుణులు, వైద్యులు సైతం ఇదే చెబుతుంటారు. అయితే, అది మితానికి పరిమితం అయినప్పుడే ఆరోగ్యానికి మంచింది.. అతి కాస్తా మితిమీరిపోతే.. దుష్ప్రభావాలు తప్పవని వార్నింగ్ ఇస్తున్నారు అదే నిపుణులు. అవును, చాలా మంది గ్రీన్ ఆరోగ్యానికి మంచిదని భావించి రోజులో ఎక్కువ సార్లు తాగుతుంటారు. అయితే, ఎక్కువసార్లు తాగడం వల్ల ప్రయోజనం కంటే నష్టాలే ఎక్కువగా కలుగుతాయని చెబుతున్నారు నిపుణులు. శరీర బరువును నియంత్రించుకోవడం, పోషకాహార లోపాన్ని సరి చేయడం కోసం, రక్తంలో చక్కెర స్థాయిలను తక్కువగా ఉంచడం వంటి అనేక సమస్యలకు గ్రీన్ టీ దివ్యౌషధంగా పని చేస్తుంది. అయితే రోజుకు మూడు కప్పుల గ్రీన్ మాత్రమే శరీరానికి మంచిది. అంతకు మించి తీసుకుంటే శరీరంపై దుష్ప్రభావాలు తప్పవని చెబుతున్నారు నిపుణులు. మరి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

తలనొప్పి: గ్రీన్ టీలో కెఫిన్ ఉంటుంది. అవసరమైన దానికంటే ఎక్కువ కెఫిన్ మన శరీరంలోకి ప్రవేశిస్తే.. అది నిరంతర తలనొప్పికి దారి తీస్తుంది.

నిద్ర సమస్యలు: ఇక్కడ కూడా కెఫీనే విలన్. ప్రతి రోజు మీ శరీరానికి అవసరమైన నిద్రను రాకుండా చేస్తుంది. రోజుకు మూడు కప్పుల కంటే ఎక్కువ గ్రీన్ టీ తాగితే, అది మీ నిద్రను చెడగొడుతుంది. ఫలితంగా నిద్రలేమి సమస్యతో బాధపడుతారు.

మలబద్ధకం: గ్రీన్ టీలో టానిన్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ముఖ్యంగా ఉదయాన్నే ఒక కప్పు గ్రీన్ టీ తాగడం వల్ల పొట్టలో ఎసిడిటీ పెరిగి జీర్ణ సమస్యలు ఏర్పడి మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి.

శరీరంలో ఐరన్ లోపం: మరో షాకింగ్ విషయం ఏంటంటే.. గ్రీన్ టీ తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ పానీయంలో యాంటీ-ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరం ఐరన్‌ను గ్రహించడంలో అడ్డుకుంటాయి. ఫలితంగా ఐరన్ లోపం సమస్య తలెత్తే అవకాశం ఉంది.

కాలేయ వ్యాధి: ఇది చాలా అరుదు అయినప్పటికీ, ఎక్కువగా గ్రీన్ టీ తీసుకోవడం వల్ల కాలేయ సమస్యలు తలెత్తుతాయి. ఇది కాలేయాన్ని దెబ్బ తీస్తుంది. అవయవం లోపల మచ్చలను ఏర్పరుస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..