నరాల బలహీనత తగ్గి.. శరీరం ఉక్కులా మారిపోయిద్ది.. నెలకు రెండు సార్లు తినండి చాలు..

వట్టి తునకలు, పల్లెటూర్లలో తరచుగా చేసుకునే ఒక సంప్రదాయ మాంసం నిల్వ పద్ధతి. వీటిని ఇంట్లోనే సులభంగా ఎలా తయారుచేయాలో ఈ కథనంలో సులువుగా తెలుసుకుందాం.. ముందుగా మటన్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. బోన్స్ లేకుండా చూసుకుంటే దారానికి కుట్టడం సులువు. ముక్కలు చిన్నవిగా ఉండడం వల్ల త్వరగా ఆరిపోతాయి.

నరాల బలహీనత తగ్గి.. శరీరం ఉక్కులా మారిపోయిద్ది.. నెలకు రెండు సార్లు తినండి చాలు..
Dried Mutton Recipe

Updated on: Sep 14, 2026 | 3:47 PM

మాంసాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి పల్లెటూర్లలో తరతరాలుగా వస్తున్న ఒక చక్కటి సంప్రదాయ పద్ధతి వట్టి తునకలు లేదా వట్టి ముక్కల తయారీ.. ప్రత్యేకించి ఎండబెట్టిన మాంసం ముక్కలు (Dry Meat) మంచి మటన్‌తో వీటిని తయారుచేస్తారు. మేక మాంసంతో చేసిన వట్టితునకలు ఎప్పుడు కావాలంటే అప్పుడు కూర వండుకోవడానికి చాలా అనుకూలం.. వట్టి తునకల్లో ఎన్నో పోషకాలు దాగుంటాయి. వట్టి తునకల్లో ప్రోటీన్, ఐరన్, జింక్, విటమిన్ B12 సమృద్ధిగా ఉంటాయి. దీంతోపాటు క్యాల్షియం, ఫాస్పరస్ కూడా ఉంటాయి. ఇవి కండరాల బలానికి, పెరుగుదలకు తోడ్పడటంతోపాటు.. రక్తహీనతను తగ్గించి, రక్తాన్ని వృద్ధి చేస్తాయి.. ఇంకా శరీర రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.. నరాల బలహీనత తగ్గి.. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. నీరసం, అలసటను తక్షణమే తగ్గించి.. ఎముకలకు పుష్టిని అందిస్తుంది. అందుకే.. బాలింతల నుంచి చిన్నా పెద్దా అందరూ.. నెలకు .. రెండు సార్లైనా తినాలని చెబుతుంటారు పెద్దలు..

అయితే.. వట్టి తనకల ప్రక్రియను దశలవారీగా ఎలా చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

వట్టి తునకల ముక్కల తయారీ:

మొదటగా, మేకమాంసం.. మటన్‌ను ఎంచుకోవాలి. ఎముకలు లేని (బోన్‌లెస్) మటన్ ముక్కలు అయితే ఈ ప్రక్రియకు మరింత అనుకూలం. ఎముకలుంటే దారానికి గుచ్చడం కాస్త ఇబ్బంది అవుతుంది. మాంసాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ పెద్దగా కాకుండా, వేగంగా ఆరిపోయేలా చిన్న ముక్కలుగా చేసుకోవడం ఉత్తమం..

శుభ్రపరచడం:

కట్ చేసిన మాంసం ముక్కలను నీటిలో బాగా శుభ్రం చేసుకోవాలి. రక్తపు మరకలు, ఇతర వ్యర్థాలు లేకుండా జాగ్రత్తగా కడగాలి. శుభ్రం చేసిన తర్వాత, ముక్కలను ఒక జాలరీ గిన్నెలో లేదా రంధ్రాలున్న పాత్రలో వేసి, అధిక నీరంతా కారిపోయేలా కొంత సమయం వదిలేయాలి. చేతులతో పిండినా సరే, కొంత నీరు మిగిలే అవకాశం ఉంటుంది కాబట్టి, జాలరీ గిన్నెలో ఉంచడం ద్వారా నీరంతా పూర్తిగా దిగిపోతుంది. సుమారు రెండు మూడు నిమిషాలు ఇలా వదిలేస్తే సరిపోతుంది.

పసుపు, ఉప్పు కలపడం:

మాంసం ముక్కలలోని నీరు పూర్తిగా పోయిన తర్వాత, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి. ముక్కలన్నిటికీ పసుపు, ఉప్పు సమంగా పట్టేలా చూసుకోవాలి. చాలామంది వట్టి తునకలు చేసేటప్పుడు స్టవ్‌పై పెట్టి నీరంతా ఇమిరిపోయేంతవరకు ఉడికించి ఆ తర్వాత ఆరబెడతారు. కానీ, ఈ పద్ధతిలో పచ్చి మాంసంతోనే ఈ ప్రక్రియను కొనసాగిస్తారు. ఉప్పు వేయడం వల్ల మాంసంలో ఏదైనా మిగిలిపోయిన తేమ ఉన్నా అది బయటకు వచ్చేస్తుంది. వండేటప్పుడు మళ్లీ ఉప్పు వేస్తాం కాబట్టి ఇప్పుడు తక్కువ మోతాదులో ఉప్పు వేస్తే సరిపోతుంది.

దారంతో గుచ్చడం:

తరువాత దశలో, ఒక పెద్ద సూది, అలాగే గట్టి దారం అవసరం. సాధారణ బట్టలు కుట్టే దారం కాకుండా, వైర్ లాంటి బలమైన దారం, ఉదాహరణకు రేషం దారం (సిల్క్ థ్రెడ్) వంటిది ఎంచుకోవాలి. ఇది మాంసం బరువును తట్టుకోవడానికి సహాయపడుతుంది. పూలమాలలు గుచ్చినట్లే, మాంసం ముక్కలను ఒక్కొక్కటిగా దారానికి గుచ్చాలి.

ఆరబెట్టడం: మాంసం ముక్కలన్నీ దారానికి గుచ్చిన తర్వాత, వాటిని ఆరబెట్టాలి. ఆరబెట్టేటప్పుడు ముక్కలు ఒకదానికొకటి తాకకుండా, కొద్దిగా దూరం దూరంగా జరిపి ఆరేయాలి. ఇది త్వరగా ఆరడానికి సహాయపడుతుంది.

ఎండలో: ఎండ బాగా ఉన్న రోజుల్లో బయట ఎండలో ఆరబెడితే చాలా త్వరగా, సమర్థవంతంగా ఆరిపోతాయి.

ఫ్యాన్ కింద: ఎండ లేని పక్షంలో, ఇంట్లో ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టవచ్చు. సుమారు రెండు రోజులు ఫ్యాన్ కింద ఉంచితే తేమ అంతా పోయి ముక్కలు చక్కగా ఆరిపోతాయి.

నిల్వ – వినియోగం:

ఇలా పూర్తిగా ఆరిన వట్టి తునకలు ఎన్ని రోజులైనా పాడవకుండా అలాగే నిల్వ ఉంటాయి. వీటిని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి, నచ్చిన విధంగా కూర వండుకొని తినవచ్చు. ఈ సంప్రదాయ పద్ధతి మాంసాన్ని వృథా చేయకుండా, ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి గొప్ప మార్గం..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us