Tomato Soup: చల్లటి చలిలో వేడి వేడి టమాట సూప్‌ తాగితే.. రెస్టరంట్ స్టైల్‌లో ఇంట్లోనే

|

Jul 20, 2024 | 8:30 PM

ఓవైపు ముసుగు పట్టేసింది, వర్షం కురుస్తూనే ఉంది. దీంతో వాతావరణం ఒక్కసారిగా కూల్‌గా మారిపోయింది. ఇలాంటి సమయంలో వేడి వేడిగా ఏదైనా తీసుకుంటే భలే ఉంటుంది కదూ! అలాంటి వాటిలో టమాట సూప్‌ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. వేడి వేడి సూప్‌ తాగడం వల్ల బాడీ వేడిగా మారడమే కాకుండా ఎన్నో రకాల అద్భుత ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు...

Tomato Soup: చల్లటి చలిలో వేడి వేడి టమాట సూప్‌ తాగితే.. రెస్టరంట్ స్టైల్‌లో ఇంట్లోనే
Tomato Soup
Follow us on

ఓవైపు ముసుగు పట్టేసింది, వర్షం కురుస్తూనే ఉంది. దీంతో వాతావరణం ఒక్కసారిగా కూల్‌గా మారిపోయింది. ఇలాంటి సమయంలో వేడి వేడిగా ఏదైనా తీసుకుంటే భలే ఉంటుంది కదూ! అలాంటి వాటిలో టమాట సూప్‌ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. వేడి వేడి సూప్‌ తాగడం వల్ల బాడీ వేడిగా మారడమే కాకుండా ఎన్నో రకాల అద్భుత ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఇంట్లోనే రెస్టరంట్ స్టైల్‌లో టమాట సూప్‌ను చేసుకోవచ్చు. ఇంతకీ టమాట సూప్‌ను ఎలా తయారు చేసుకోవాలి.? దీనికి కావాల్సిన వస్తువులు ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు..

టమాటాలు 10, ఒక టీ స్పూన్‌ కారం, ఒక టీ స్పూన్ మిరియాల పొడి, ఒక టీ స్పూన్‌ జీలకర్ర పొడి, ఒక టీ స్పూన్‌ అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో పాటు 4 కప్పుల నీళ్లు, రుచికి తగినంత ఉప్పు కావాల్సి ఉంటుంది.

ఇక తయారీ విధానానికొస్తే.. ఇందుకోసం ముందుగా టమాటలను తీసుకొని వాటిని శుభ్రంగా కడగాలి. అనంతరం కుక్కర్‌లో రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అనంతరం వాటిని మిక్సీలో వేసుకొని గ్రౌండ్‌ చేసుకోవాలి. తర్వాత ఇందులో నాలుగు కప్పుల నీటిని కలుపుకొని స్టవ్‌ మీద వేడి చేయాలి. టమాట రసం బాగా మరిగించాలి. తర్వాత ఇందులో కారం, జీలకర్ర పొడి, అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత గ్యాస్‌ను సిమ్‌లో పెట్టి మరికొంచెం సేపు మరిగించాలి. చివరిగా పుదీనా వేసుకుంటే సరిపోతుంది. వేడి వేడి సూప్‌ రడీ అయినట్లే.

టమాట సూప్‌తో లాభాలు..

టమాట సూప్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇందులోని విట‌మిన్లు, మిన‌ర‌ల్స్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. గుండె జ‌బ్బులు, క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధులకు చెక్‌ పెడుతుంది. టమాటా సూపన్‌ను తాగితే వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు దరిచేరవు. ఇదిలా ఉంటే టమాట సూప్‌ను అధికంగా తీసుకుంటే మాత్రం కొన్ని రకాల సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..