Breakfast: రోజూ అదే టిఫిన్‌ బోర్‌ కొడుతోందా.? అటుకలతో ఇలా చేయండి, రుచి అమోఘం

|

May 17, 2024 | 8:02 AM

మరీ ముఖ్యంగా ప్రస్తుతం సమ్మర్‌ హాలీడేస్‌ నేపథ్యంలో పిల్లలు స్కూళ్లకు వెళ్లే పనిలేదు దీంతో నెమ్మదిగా కొత్త రెసిపీలను ట్రై చేయొచ్చు. మరి మీక్కూడా ఎప్పుడు తినే టిఫిన్స్‌తో బోర్‌గా ఫీలవుతున్నారా.? అయితే మీకోసమే ఈ సరికొత్త టిఫిన్‌ను పరిచయం చేస్తున్నాం. పొహా (అటుకలతో) చేసే కట్లెట్‌ను ఎలా చేయాలి.? దీనికి ఏమేం వస్తువులు కావాలి.? ఇప్పుడు తెలుసుకుందాం..

Breakfast: రోజూ అదే టిఫిన్‌ బోర్‌ కొడుతోందా.? అటుకలతో ఇలా చేయండి, రుచి అమోఘం
Poha Cutlet
Follow us on

ఉదయం లేవగానే ప్రతీ ఒక్కరూ టిఫిన్‌ కోసం ఆలోచిస్తుంటారు. గృహిణుల రోజు మొదలయ్యేదే ఈరోజు ఏం టిఫిన్‌ చేద్దాం అని. అయితే రోజు ఒకే రకమైన టిఫిన్‌తో తినే వారితో పాటు చేసే వారికి కూడా బోర్‌ కొట్టడం సర్వసాధారణమైన విషయం. అందుకే యూట్యూబ్‌లో చూస్తూ రకరకాల వంటకాలను ట్రై చేస్తుంటారు.

మరీ ముఖ్యంగా ప్రస్తుతం సమ్మర్‌ హాలీడేస్‌ నేపథ్యంలో పిల్లలు స్కూళ్లకు వెళ్లే పనిలేదు దీంతో నెమ్మదిగా కొత్త రెసిపీలను ట్రై చేయొచ్చు. మరి మీక్కూడా ఎప్పుడు తినే టిఫిన్స్‌తో బోర్‌గా ఫీలవుతున్నారా.? అయితే మీకోసమే ఈ సరికొత్త టిఫిన్‌ను పరిచయం చేస్తున్నాం. పొహా (అటుకలతో) చేసే కట్లెట్‌ను ఎలా చేయాలి.? దీనికి ఏమేం వస్తువులు కావాలి.? ఇప్పుడు తెలుసుకుందాం..

ఇందుకోసం ముందుగా ఒక బౌల్‌లోకి కొన్ని అటుకులు తీసుకొని కొన్ని నీళ్లు పోసి 10 నిమిషాల నానబెట్టాలి. అనంతరం మరో బౌల్‌లో కొంత ఉప్మా రవ్వను తీసుకొని, అందులో కొంత మజ్జిగను, నిమ్మరసాన్ని యాడ్ చేయాలి. ఆ తర్వాత కొన్ని నీళ్లు పొసి రవ్వను కలిపేయాలి. అటుకులు మెత్తగా మారిన తర్వాత స్మాష్‌ చేసుకోవాలి. అనంతరం అటుకులను అంతకుముందు చేసి పెట్టుకున్న రవ్వలో వేసి బాగా కలుపుకోవాలి.

పిండి చిక్కగా మారేలా చేసిన తర్వాత అందులోకి కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తమిరీ, ఉల్లిపాయ, క్యారెట్‌ తురుము, జిలకర్ర, కారం, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అనంతరం ఒక ప్యాన్ తీసుకొని కొంచం ఆయిల్‌ వేసుకొని.. అంతకు ముందుకు సిద్ధం చేసుకున్న పిండిని ప్యాన్‌పై వేసి చిన్న చిన్న కట్లెట్స్‌లాగా చేసుకోవాలి. అనంతరం వాటిని బాగా ఫ్రై చేయాలి. అంతే ఎంతో రుచికరమైన పోహా కట్లెట్‌ రెసిపీ రడీ అయినట్లే దీనిని. చట్నీ లేదా సాస్‌తో తీసుకుంటే ఆహా అనాల్సిందే.

మరిన్ని ఫుడ్ కథనాల కోసం క్లిక్ చేయండి..